Watch TV : కాలం మారుతున్న కొద్ది టెక్నాలజీ మారిపోతుంది. దీంతో కొత్త కొత్త వస్తువులు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా టెలివిజన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు కేవలం రేడియో ద్వారా వినోదం పొందిన వారు ఆ తర్వాత టీవీతో కాలక్షేపం చేశారు. మొదట్లో బ్లాక్ అండ్ వై టీవీలో అందుబాటులోకి వచ్చి ఆ తర్వాత కలర్.. ఇప్పుడు స్మార్ట్ టీవీలు అందుబాటులోకి వచ్చాయి. నేటి కాలంలో చాలామంది ఇంట్లో స్మార్ట్ టీవీలు దర్శనమిస్తున్నాయి. ఇవి రకరకాల సైజులను బట్టి ఉంటున్నాయి. కొందరి ఇంట్లో ఒక గదిలో ప్రత్యేకంగా టీవీ ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇవి దాదాపు 50 నుంచి 55 అంగుళాల వరకు ఉంటున్నాయి. అయితే ఇంత పెద్ద టీవీ నీ ఎంత దూరం నుంచి చూడాలి? అని కొంతమంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. దాని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే.
Also Read : అదే పనిగా టీవీ చూస్తున్నారా.. అయితే మీరు డేంజర్ లో ఉన్నట్టే..
ఉదయం నుంచి సాయంత్రం వరకు బిజీ వాతావరణం లో కలిపిన వారు.. గృహిణులు.. విద్యార్థులు సాయంత్రం మానసికంగా ఉల్లాసంగా ఉండడానికి టీవీని తప్పనిసరిగా చూస్తారు. అయితే ప్రస్తుత కాలంలో స్మార్ట్ టీవీలు అందుబాటులోకి రావడంతో అందరూ వీటిని కొనుగోలు చేశారు. టీవీలోనే ఇంటర్నెట్, యూట్యూబ్ లాంటివి కూడా రావడంతో చిన్న పెద్ద అంతా కలిసి టీవీకే అతుక్కుపోతున్నారు. అయితే టీవీ వల్ల మానసికంగా ఎంతో ఉల్లాసంగా ఉంటున్న.. టీవీ ఎక్కువగా లేదా సరైన రీతిలో చూడకపోవడం వల్ల కళ్ళపై ప్రభావం పడే అవకాశం ఉందని ఐ స్పెషలిస్టులు అంటున్నారు. పెద్ద స్క్రీన్కలు లిగిన టీవీని దగ్గరగా చూడడం వల్ల కళ్ళపై తీవ్ర ప్రభావం పడుతుందని అంటున్నారు. అయితే ఎన్ని ఇంచుల టీవీని ఎంత దూరం నుంచి చూడాలి?
టీవీలు రకరకాల సైజుల్లో ఉంటాయి. వీటిలో మొదటిది 24 అంగుళాల టీవీ. ఈటీవీ గనక మీ ఇంట్లో ఉంటే దీనిని మూడు అడుగుల దూరం నుంచి చూడాలి. అలా చూడడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే 28 ఇంచుల టీవీ ఉంటే దానిని చూడడానికి 5 అడుగుల దూరంలో కూర్చోవాలి. అలాగే 32 అంగుళాల టీవీ ఉన్నట్లయితే దానిని ఆరు అడుగుల దూరం నుంచి చూడాలి. 43 అంగుళాల టీవీ ఉంటే దీనికి ఎనిమిది అడుగుల దూరంలో కూర్చోవాలి. ఇక 50 నుంచి 55 ఇంచుల టీవీ ఉన్నట్లయితే దీనిని చూడడానికి కనీసం 10 అడుగుల దూరంలో కూర్చోవాలని చెబుతున్నారు.
ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ విషయంలో కచ్చితంగా ఉండాలని అంటున్నారు. ఎందుకంటే పెద్ద స్క్రీన్లు కలిగిన టీవీలో రకరకాల కలలు కనిపిస్తాయి. ఇవి కళ్ళపై ప్రభావం పడతాయి. అందువల్ల నిర్ణీత దూరం నుంచి ఇలాంటి టీవీలను చూస్తే ఎలాంటి ప్రభావం ఉండదు. అంతేకాకుండా పెద్దవారు సైతం టీవీని సాధ్యమైనంత దూరంలో నుంచి చూడడం అలవాటు చేసుకోవాలి. లేకుంటే తలనొప్పి, అలసట వంటి ఇబ్బందులు ఏర్పడతాయి. అంతేకాకుండా ప్రతి రోజు ఒక నిర్ణీత సమయంలోనే టీవీని చూడాలి.
Also Read : వేణుస్వామి ఆరోపణలు నిజమైతే నన్ను కొట్టిచంపండి: జర్నలిస్ట్ టీవీ 5 మూర్తి