https://oktelugu.com/

High Resolution monitors : అతి తక్కువ ధరకే.. హై రిజల్యూషన్ మానిటర్లు.. ఎక్కడో తెలుసా?

డెస్క్ టాప్ కంప్యూటర్ కు మానిటర్ చాలా ముఖ్యం. అయితే ఇవి బెస్ట్ రిజల్యూషన్ ఉండడం వల్ల ఉపయోగకరంగా ఉంటాయి. ఈ క్రమంలో కొందరు అధిక ధర చెల్లించి అయినా రిజల్యూషన్ ఎక్కువగా ఉన్న మానిటర్లు తీసుకుంటారు. అయితే ఇటీవల కొన్ని కంపెనీలు అత్యధిక రిజల్యూషన్ కలిగిన మానిటర్లను తక్కువ ధరకే అందిస్తున్నాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : October 15, 2024 / 01:24 PM IST

    High Resolution monitors

    Follow us on

    High Resolution monitors : ప్రపంచంలో టెక్నాలజీ వాడకం విపరీతంగా మారింది. ప్రతీ విషయంలో మొబైల్, కంప్యూటర్ కచ్చితంగా వాడుతున్నారు. ఒకప్పడు ఎక్కడో చోట మాత్రమే డెస్క్ టాప్ కంప్యూటర్ కనిపించేది. కానీ ఇప్పుడు విద్యార్థుల వద్ద కూడా ల్యాప్ టాప్స్ కనిపిస్తున్నాయి. అయితే ఎన్ని కొత్త రకం ల్యాప్ లాప్ లువచ్చినా.. కొన్ని అవసరాల కోసం డెస్క్ టాప్ కంప్యూటర్లే అనుగుణంగా ఉంటాయి. ముఖ్యంగా వీడియో మేకింగ్ వంటి వాటికి డెస్క్ టాప్ కంప్యూటర్ మాత్రమే ఉపయోగకరంగా ఉంటుంది. దీంతో వాటి అమ్మకాల తగ్గకుండా ఉన్నాయి. అయితే మార్కెట్లో కంపెనీల మధ్య పోటీ పెరగడంతో అత్యధిక ధరతో పాటు నాణ్యమైన పరికరాలు తక్కువ ధరకే లభిస్తున్నాయి. తాజాగా కొన్ని కంపెనీలు మంచి రిజల్యూషన్ తో కూడిన మానిటర్లను తక్కువ ధరకే అందిస్తున్నాయి. వాటి వివరాల్లోకి వెళితే..

    డెస్క్ టాప్ కంప్యూటర్ కు మానిటర్ చాలా ముఖ్యం. అయితే ఇవి బెస్ట్ రిజల్యూషన్ ఉండడం వల్ల ఉపయోగకరంగా ఉంటాయి. ఈ క్రమంలో కొందరు అధిక ధర చెల్లించి అయినా రిజల్యూషన్ ఎక్కువగా ఉన్న మానిటర్లు తీసుకుంటారు. అయితే ఇటీవల కొన్ని కంపెనీలు అత్యధిక రిజల్యూషన్ కలిగిన మానిటర్లను తక్కువ ధరకే అందిస్తున్నాయి. వీటిలో Dell కంపెనీకి చెందిన ఫుడ్ హెచ్ డీ మానిటర్ మార్కెట్లో అందుబాటులో ఉంది. 22 అంగుళాల ఈ మానిటర్ ను రూ.6,799 కే అందిస్తున్నారు. ప్లిక్కర్ ఫ్రీ టెక్నాలజీతో కూడాని ఈ మానిటర్ తో కేవలం కప్యూటర్ కోసం మాత్రమే కాకుండా టీవీని కనెక్ట్ చేసుకోవచ్చు. ప్రతీ ఒక్క షో హెచ్ డీలో డిస్ ప్లే అవుతుంది.

    Lenova కంపెనికి చెందిన మరో మానిటర్ అతి తక్కువ ధరకే లభించనుంది. ఇందులోని ఎల్ సిరీస్ మానిటర్ 21.5 ఇంచుల డిస్ ప్లే ఉంటుంది. ఇందులో కంప్యూటర్ తో పాటు టీవీ, గేమింగ్ కు కూడా అవకాశం ిచ్చారు. ఎర్గోనామిక్ టిల్ట్ స్టాండ్ కలిగిన దీనిని రూ.6,799కే అందిస్తున్నారు. దీనిని అమెజాన్ నుంచి బుక్ చేసుకోవచ్చు. BenQ అనే కంపెనీకి చెందిన మానిటర్ ను తక్కువ ధరకే అందిస్తున్నారు. ఈ మానిటర్ బ్రైట్ నెస్ తో పాటు విజువల్ అద్భుతంగా ఉంటుంది. ఇందులో డ్యూయెల్ హెచ్ డీఎంఐ పోర్టులు, యాంటీ గ్లేర్ టెన్నాలజీ ఉండనుంది. దీనిని రూ. 7,149 కి విక్రయించనున్నారు. ఇది అమెజాన్ లో అభ్యం కానుంది.

    ప్రముఖ కంపెనీ SAMSUNG నుంచి కూడా అతి తక్కువ ధరకే మానిటర్ ను అందిస్తున్నారు. ఇందులో ఏ వీడియో అయినా హై రెజల్యషన్ తో కనిపిస్తుంది. హెచ్ డీఎం ఐ, డీ సబ్ పోర్టుల ద్వారా ఇతర పరికరాలను అమర్చుకోవచ్చు. ఆఫీసు పనులతో పాటు ఇంట్లోని టీవీకి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. 22 అంగుళాలు ఉండే ఈ మానిటర్ ను రూ.6,199కే విక్రయిస్తున్నారు. ఇది ప్రస్తుతం అందుబాటులో ఉంది. ప్రముఖ కంపెనీలకు చెందిన ఈ మానిటర్లు తక్కవ ధరకు కొన్నిరోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయిన కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. అందువల్ల వీటిని కోరుకునేవారు వెంటనే బుక్ చేసుకోవాలని చెబుతున్నారు.