Shubhanshu Shukla 2 Indian astronaut: భారత అంతరిక్ష అధ్యయనంలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. వింగ్ కమాండర్ రాకేష్ శర్మ 1984లో అంతరిక్షంలోకి వెళ్లి రికార్డు సృష్టించిన 41 సంవత్సరాల తర్వాత, రెండవ భారతీయ వ్యోమగామి అంతరిక్షంలోకి విజయవంతంగా పయనం అయ్యారు. ఈసారి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వైపు సాగిన ఈ మిషన్ భారతదేశానికి గర్వకారణంగా నిలిచింది.
ఎన్నో సార్లు వాయిదా పడిన తర్వాత యాక్సియం మిషన్ 4 బుధవారం నాడు స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ క్రూ డ్రాగన్ క్యాప్సూల్, భారత వ్యోమగామి శుభాంశు శుక్లాతో సహా నలుగురు వ్యోమగాములను మోసుకెళ్లింది. యుద్ధ విమాన పైలట్ అయిన శుభాంషు శుక్లా(39)ను ఇస్రో ఈ చారిత్రక ప్రయాణం కోసం సెలక్ట్ చేసింది. సుమారు 26 గంటల్లో ఈ అంతరిక్ష నౌక ఐఎస్‌ఎస్‌కు అనుసంధానించబడుతుందని అంచనా. దీంతో శుక్లా అంతరిక్షంలో తిరిగే ల్యాబ్‌ను సందర్శించిన మొట్టమొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టించనున్నారు.
Also Read: Gaganyaan Mission: ఇస్రో గగన్ యాన్ లో ఈగలు.. స్పేస్ లోకి పంపించడం వెనక కారణాలు ఇవే?
పోలాండ్, హంగరీ దేశాలకు చెందిన వ్యోమగాములతో కలిసి భారతదేశం నుంచి వ్యోమగామి అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన మొట్టమొదటి మిషన్ ఇదే. స్పేస్‌ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌక ఇప్పుడు కక్ష్యలో ఉంది. జూన్ 26న ఉదయం 7:00 గంటలకు ఐఎస్‌ఎస్‌కు కనెక్ట్ కానున్నట్లు యాక్సియం స్పేస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది హార్మొనీ మాడ్యూల్ స్పేస్-ఫేసింగ్ పోర్ట్‌కు కనెక్ట్ అవుతుంది.
ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ కెప్టెన్ శుభాంశు శుక్లాకు అభినందనలు తెలిపారు. నాసా మాజీ వ్యోమగామి, యాక్సియం స్పేస్ హ్యూమన్ స్పేస్‌ఫ్లైట్ డైరెక్టర్ పెగ్గీ విట్సన్ ఈ కమర్షియల్ మిషన్‌కు కమాండ్ గా వ్యవహరిస్తున్నారు. ఇస్రో వ్యోమగామి శుభాంశు శుక్లా పైలట్‌గా వ్యవహరిస్తున్నారు.
Liftoff of Ax-4! pic.twitter.com/RHiVFVdnz3
— SpaceX (@SpaceX) June 25, 2025
లక్నోకు చెందిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్లి చరిత్ర సృష్టించారు. 1984లో రాకేష్ శర్మ అంతరిక్షయానం చేసిన తర్వాత, 41 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అంతరిక్షంలోకి వెళ్ళిన రెండో భారతీయుడు శుభాంశు శుక్లా. లక్నోలోని సిటీ మాంటిస్సోరి స్కూల్, అలీగంజ్ పూర్వ విద్యార్థి అయిన శుక్లా.. 2006లో భారత వైమానిక దళంలో చేరారు. అప్పటి నుండి ఒక ఫైటర్ పైలట్‌గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు.
శుభాంశు శుక్లాకు 2,000 గంటలకు పైగా విమానాలు నడిపిన అనుభవం ఉంది. ఆయన 16 సంవత్సరాలకు పైగా దేశానికి సేవ చేశారు. ఆయనకు ‘గుంజన్’ అనే ముద్దుపేరు కూడా ఉంది. శుక్లాకు ముగ్గురు తోబుట్టువులు ఉండగా, వారిలో అందరికంటే చిన్నవాడు ఈయనే. అంతేకాదు, తన కుటుంబంలో ఆయన ఒక్కరే సాయుధ దళాల్లో చేరారు. తన పైలట్ కెరీర్‌లో, ఆయన Su-30MKI, MiG-21, MiG-29, Jaguar, Hawk వంటి అనేక యుద్ధ విమానాలను నడిపారు. ఆయన ఒక ఫైటర్ కంబాట్ లీడర్, పలు అవార్డులు గెలుచుకున్నారు.
Also Read: Jahnavi Dangeti 2029 Space Mission: అంతరిక్ష యాత్రకు తెలుగు యువతి!
ఇస్రో మానవ అంతరిక్షయాన కార్యక్రమం కింద శుభాంశు ఎంపికయ్యారు. రాబోయే గగన్‌యాన్ మిషన్ కోసం కూడా ఆయన ప్రధాన అభ్యర్థులలో ఒకరు. గత ఎనిమిది నెలలుగా, ఆయన నాసా , యాక్సియం స్పేస్ తో కలిసి ట్రైనింగ్ తీసుకున్నారు. శుభాంశు శుక్లా ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్లడంతో, 1984లో రాకేష్ శర్మ సోవియట్ సోయుజ్ అంతరిక్ష నౌకలో చారిత్రక ప్రయాణం చేసిన తర్వాత, 40ఏళ్ల తర్వాత అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయ వ్యోమగామిగా నిలిచారు.
యాక్సియం-4 మిషన్ బృందంలో పోలాండ్ దేశానికి చెందిన ఈఎస్‌ఏ (యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ) ప్రాజెక్ట్ వ్యోమగామి స్లావోష్ ఉజ్నాన్స్కీ-విస్నియెవ్స్కీ, హంగేరీ దేశానికి చెందిన హునోర్ వ్యోమగామి టిబోర్ కపు కూడా ఉన్నారు. 14 రోజుల మిషన్‌లో యాక్సియం-4 బృందం కక్ష్యలో ఉన్న అంతరిక్ష కేంద్రంలో నివసిస్తూ, 31 దేశాలకు చెందిన సుమారు 60 విభిన్న పరిశోధన కార్యకలాపాలను నిర్వహిస్తారు. ఈ అధ్యయనాలు మానవ పరిశోధన, భూ పరిశీలన, జీవ, జీవశాస్త్ర, భౌతిక శాస్త్రాలకు దోహదపడతాయి.
Group Captain #ShubhanshuShukla, a test pilot of the Indian Air Force and #ISRO astronaut, is set to become the second Indian to go into space after four decades. Proud of ISRO and the #IndianAirForce.
Jai Hind#shreeganeshyayNamh #WednesdayWisdom Varsha Ritu #Emergency1975 pic.twitter.com/4VP2t7lzxD
— UPSC Civil Services (@UpscCivil) June 25, 2025