Karungali Mala Celebrity Trend: సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు స్టార్ హీరోలుగా ఎదిగినప్పటికి వాళ్లకి కొన్ని నమ్మకాలైతే ఉంటాయి. పర్టిక్యూలర్ గా ఆ నమ్మకాలను మాత్రం వాళ్ళు వదిలేయకుండా ఫాలో అవుతూ ఉంటారు. కారణం వారు నమ్ముకున్న నమ్మకాలే అని చెప్పే సెలబ్రిటీలు కూడా ఉండటం విశేషం… కొంతమంది స్టార్ హీరోలు రిలీజ్ కి ముందు కొన్ని దేవాలయాలను సందర్శిస్తూ వస్తారు. అలా ఆ దేవాలయాలకు వెళ్లడం వల్ల వాళ్లకు సక్సెస్ దక్కుతుంది అనే ఒక నమ్మకంతో ఉంటారు. దాంతో పాటుగా పాజిటివ్ వైబ్రేషన్ కూడా వస్తుందని చెబుతూ ఉంటారు. ఇక ఇప్పటివరకు చాలామంది హీరోలు హీరోయిన్స్ ఇలా చేస్తూనే వస్తున్నారు. ఇక ప్రస్తుతం తెలుగు, తమిళ్ అని తేడా లేకుండా ప్రతి ఒక్క హీరో కరుంగలి మాలని ధరిస్తున్నారు. దానికి కారణం ఏంటి అంటే ఆ మాల వేసుకోవడం వల్ల వాళ్ల మీద ఉండే నరదిష్టి పోతుంది అని వాళ్లకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుందని వాళ్ళ చుట్టూ పాజిటివ్ వైబ్స్ ఉంటాయనే ఉద్దేశ్యంతోనే వాళ్ళు అలా మాలని ధరిస్తున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు మాలను ధరించడం వల్ల ఆ మాల అనేది బాగా ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు నార్మల్ పర్సన్స్ కూడా వాటిని ధరిస్తూ వాళ్లకున్న దిష్టి పోగొట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక వీటిని నమ్మని కొంతమంది మాల వేసుకున్నంత మాత్రాన సక్సెస్ లు వస్తాయా ప్రశాంతత దొరుకుతుందా?
మన మైండ్ ను బట్టి ఏదైనా ప్లేస్ కి వెళ్ళి అక్కడికి ప్రశాంతంగా గడిపితే సరిపోతోంది. అంతే తప్ప మాల వేయడం వల్ల ఏమీ రాదు అని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీలో ఒక నమ్మకం అనేది బలంగా పాతుకుపోతోంది.
కాబట్టి దాన్ని నమ్మినప్పుడు సక్సెసు లు వస్తే లైఫ్ లాంగ్ మన హీరోలు, దర్శకులు దానిని ఆచరిస్తూ ఉంటారు…ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం మన స్టార్ హీరోలందరూ మంచి సినిమాలు చేసి సూపర్ సక్సెస్ లను సాధిస్తేనే ఇండియాలో నెంబర్ వన్ పొజిషన్ కి చేరుకుంటారు…
