Jahnavi Dangeti 2029 Space Mission: తెలుగు యువతికి అరుదైన గౌరవం దక్కింది. 2029లో అంతరిక్షంలో అడుగుపెట్టి ఛాన్స్ వచ్చింది. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన 23 ఏళ్ల యువతి జాహ్నవి దంగేటి( jakhnavi dangeti ) ఈ అద్భుత అవకాశం చేజిక్కింది. అమెరికాకు చెందిన ప్రైవేటు అంతరిక్ష పరిశోధన సంస్థ టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ 2029లో చేపట్టనున్న అంతరిక్ష యానంలో జాహ్నవికి చోటు లభించింది. ఈ మూడేళ్ల పాటు ఆమెకు శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ అనంతరం అంతరిక్ష శోధనకు వెళ్ళనున్నారు. అయితే ఏపీ నుంచి ఈమె ఎంపిక కావడం శుభ పరిణామం.
పాలకొల్లు స్వస్థలం
పశ్చిమగోదావరి జిల్లా( West Godavari district ) పాలకొల్లుకు చెందిన జాహ్నవి స్థానికంగానే విద్యాభ్యాసం పూర్తి చేశారు. బీటెక్ పూర్తయ్యాక అంతరిక్షం పట్ల చాలా ఆసక్తితో 2022లో పోలాండ్ లోని అనలాగ్ స్పేస్ ట్రైనింగ్ కేంద్రంలో శిక్షణ పొందారు. చిన్న వయస్సులోనే వ్యోమగామిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆమె అంతరిక్ష ప్రయాణం ఖరారు అయ్యింది. దీంతో జాహ్నవి పేరు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోతోంది. జాతీయ స్థాయిలో సైతం ఆమె గుర్తింపు సాధించారు. ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఐదు గంటల పాటు అంతరిక్షంలో
2029 మార్చిలో అంతరిక్షంలోకి ప్రయాణం చేయనున్నారు జాహ్నవి. దాదాపు 5 గంటల పాటు ఆమె అంతరిక్షంలో ప్రయాణించనున్నారు. ఈ విషయాన్ని టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్( Titans space industry ) స్పష్టం చేసింది. తెలుగు యువత ఈ ఘనత సాధించడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ యాత్ర కోసం ఆమె మూడేళ్ల పాటు శిక్షణ తీసుకోనున్నారు. ట్రైనింగ్ అనంతరం ఆమె అంతరిక్ష ప్రయాణం చేయనున్నారు.