Gaganyaan Mission: మానవులలో రోగాలు కలగడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇందులో ఈగలు జెనటిక్ పాథ్ వేస్ ను 75% వరకు షేర్ చేసుకుంటున్నాయి. అందువల్లే ఇస్రో ఈ ప్రయోగానికి ఈగలను ఎంచుకున్నది. మైక్రో గ్రావిటీ మాత్రమే ఉండే అంతరిక్షంలో.. శరీర జీవక్రియలకు సంబంధించిన సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి ఇస్రో ఈ ప్రయోగం చేస్తోంది. ఈగల స్పేస్ జర్నీకి సంబంధించి కథ కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.. అంతరిక్షంలోకి అసలు ఈగలను పంపించి ఏం చేస్తారు? దానివల్ల ఇస్రో శాస్త్రవేత్తలు ఎటువంటి అంశాలను పరిశీలిస్తారు? దానివల్ల కలిగే లాభాలు ఏమిటి? అనే విషయాలపై విపరీతమైన ఆసక్తి పెరిగింది. అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములకు అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అయితే వీటిని పరిశీలించడానికి ఇస్రో ఈగలను పంపిస్తున్నది. అంతరిక్షంలోకి పంపించే ఈగలను కర్ణాటకలోని ధార్వాడ్ అగ్రికల్చరల్ సైన్సెస్ విశ్వవిద్యాలయం (UAS) లోని బయోటెక్నాలజీ విభాగంలోని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఫ్రూట్ ఫ్లైస్ ఒక్కో కిట్ లో దాదాపు 15 ఈగల వరకు ఉంటాయి. వీటిని గగన్ యాన్ ద్వారా అంతరిక్షంలోకి పంపిస్తారు. ఆ ఈగలు వారం పాటు అక్కడే ఉంటాయి. జీరో గ్రావిటీ కక్ష్య లో జీవిస్తాయి.. అంతరిక్షంలో శూన్య గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. అంతరిక్షంలోకి వ్యోమగాములు వెళ్ళినప్పుడు ద్రవ రహిత ఆహారాన్ని తీసుకుంటారు. అంతరిక్షంలో ఉండడం వల్ల వారి ఎముకల్లో కూడా క్షీణత ఏర్పడుతుంది. ఆ సమయంలో శరీరంలో కాల్షియం అధికంగా ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు వ్యోమగాముల ఆరోగ్యంలో అనేకమార్పులు వస్తాయి. వాటిని పరిశీలించడానికి ఇస్రో గగన్ యాన్ ప్రయోగంలో ఈగలను పంపిస్తోంది.
చికిత్సను కనుక్కుంటారట..
గగన్ యాన్ ప్రయోగంలో భారత వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్తారు. వారు వెళ్ళినప్పుడు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. వాటికి చికిత్సను కనుగొనేందుకు ఈ ప్రయోగం చేస్తున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు..” అంతరిక్షంలోకి వెళ్లిన ఈగలకు సోడియం ఆక్సలేట్, ఇథైల్ గ్లైకోల్, హైడ్రాక్సీ ఎల్ ప్రోలైన్ లు అధికంగా ఉండే పిండి, బెల్లం తో ఓ ద్రవాన్ని తయారు చేస్తాం. దానిని వాడికి ఆహారంగా ఇస్తాం.. దీనివల్ల ఈగల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఆ రాళ్లు ఏ పరిమాణంలో ఏర్పడతాయి? ప్రారంభంలో వాటిని ఏర్పడకుండా అరికట్టవచ్చా? ముందస్తుగా రాళ్లు ఏర్పడకుండా జాగ్రత్త తీసుకోవచ్చా? అనే అంశాలను తెలుసుకోవడానికి ఈగలను అంతరిక్షంలోకి పంపిస్తున్నామని” ఇస్రో శాస్త్రవేత్తలు అంటున్నారు.. 2025లో చేపట్టే గగన్ యాన్ ప్రయోగంలో వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించనుంది. ఇప్పటికే కొంతమందిని ఎంపిక చేసింది. వారందరినీ ప్రత్యేకమైన వాతావరణంలో ఉంచుతోంది. అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములలో కాల్షియం అధికంగా ఏర్పడుతుంది. అది అంతిమంగా అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అయితే ఈ రాళ్లు ఎలా ఏర్పడతాయి..కాల్షియం వల్లనేనా? దీనికి మరో కారణం ఏదైనా ఉందా? అనే విషయాలు తెలుసుకోవడానికి ఈ ప్రయోగం చేస్తున్నామని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు.