Evolution in Reverse:సాధారణంగా రివర్స్ అనే పదానికి అర్థం.. ముందుకు వెళ్లి వెనక్కి రావడం. కాలం, జీవితం ముందుకు వెళ్లడమే కానీ వెనక్కి వచ్చే అవకాశం లేదని ఎంతోమంది శాస్త్రవేత్తలు, పెద్దలు చెబుతూ జీవిత సత్యాలను గుర్తు చేస్తూ ఉంటారు. అయితే ముందుకు వెళ్లిన జీవితం మళ్ళీ వెనక్కి రావడం అంటే అది సినిమాల్లో మాత్రమే సాధ్యం. ఎందుకంటే ఒక కథ చెప్పడానికి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాలంటే మళ్ళీ రివర్స్ రావాలి. కానీ నిజమైన జీవితంలో రివర్స్ వచ్చి అవకాశం ఉందంటే ఎవరైనా నమ్ముతారా..? కానీ కొందరు పరిశోధకులు ఈ విషయాన్ని చెబుతూ దడ పుట్టిస్తున్నారు. దానికే ‘ రివర్స్ ఎవల్యూషన్’ అని పేరు పెట్టారు. అసలు ఏంటి ఈ ‘రివర్స్ ఎవల్యూషన్’.?
Also Read: మద్యం తాగేవారికి అలర్ట్.. ఈ బ్రాండ్ టెస్ట్ చేశారా?
మానవ పుట్టుక గురించి పరిశోధకులు ఎన్నో రకాలుగా వివరించారు. కానీ డార్విన్ సిద్ధాంతం ప్రకారమే మానవుడు పరిణామం చెందాడని అంటారు. మనిషి కోతి నుంచి ఆవిర్భవించాడని.. కాలక్రమమైన అభివృద్ధి చెందుతూ ఇప్పుడు హాయిగా జీవిస్తున్నాడని చెబుతుంటారు. అయితే ఇలా మారిన మనిషి మళ్ళీ కోతి లాగా మారిపోతాడు అంటే ఎవరు నమ్మరు. కానీ తాజాగా కొంతమంది పరిశోధకులు అధ్యయనం చేసి కొన్ని రకాల ఆహార పదార్థాల ద్వారా మళ్లీ మనిషి పుట్టుక స్థానానికి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.
దక్షిణ అమెరికా లోని కొన్ని పక్షుల సమూహం ఈక్వెడార్ లోని అడవులకు కొన్ని మొక్కలను తీసుకువచ్చాయి. ఇక్కడ ఉన్న గాలాప గోస్ అనే దీవుల్లో ఉన్న టమాటా మొక్కలపై కొందరు పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలో టమాటా మొక్కల్లో విషపూరితమైన కాంపౌండ్స్ ఉన్నట్లు గుర్తించారు. ఈ కాంపౌండ్స్ మొక్కలకు రక్షణగా నిలుస్తాయి. జంతువులు, పురుగులు మొక్కలను తినకుండా కాపాడుతాయి. అయితే ఈ కాంపౌండ్స్ కూరగాయల్లో తక్కువగా ఉంటే పర్వాలేదు. కానీ మితిమీరి ఉండడంతో వీటిని మనుషులు తింటే ప్రమాద స్థాయికి వెళ్తారు. ముందుగా ఈ పరిస్థితిని గుర్తించిన శాస్త్రవేత్తలు వీటిపై పరిశోధనలు చేయడానికి అక్కడికి వెళ్లారు.
Also Read: ఈ తెల్లని ఇసుక బీచ్ లను చూశారా? స్వర్గానికి తక్కువ కాదు..
ఇక్కడ లోతుగా పరిశోధన చేసిన తర్వాత టమాటా మొక్కల్లో లక్షల ఏళ్ల నాటి ఆల్కలాయిడ్స్ ఉన్నట్లు గుర్తించారు. పురాతన కాలంలో వంకాయల్లో ఉండే ఆల్కలాయిడ్స్ ఇప్పుడు టమాట మొక్కల్లో ఉన్నట్లు తేల్చారు. సాధారణంగా ఇక్కడి వాతావరణ పరిస్థితులకు మొక్కలు తట్టుకోవడమే కష్టం. అయినా ప్రతికూల పరిస్థితుల్లో మొక్కలు పెరగడమే కాకుండా అందులో లక్షల ఏళ్ల నాటి ఆల్కలాయిడ్స్ ఉండడం వల్ల పరిశోధకులు షాక్ తిన్నారు. అంటే ఈ మొక్కల నుంచి టమాటాలు బయటకు వచ్చి వాటిని తినడం వల్ల మనిషి మళ్ళీ జీవపరిణామం మొదటి దశకు వెళ్లే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అంటే ఆధునికత నుంచి రివర్స్ వెళ్లే అవకాశం ఉందని చెప్తారు. సాధారణంగా ఎవల్యూషన్ అనేది ముందుకు సాగడమే ఉంటుంది. కానీ ఈ పరిశోధనల ద్వారా ‘రివర్స్ రెవల్యూషన్ ‘ ఉండే అవకాశం ఉందని పరిశోధకులు అంటున్నారు. అయితే ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.