Homeఆంధ్రప్రదేశ్‌Reporter Vs Media Boss: ఆర్టీఐ కమిషనర్ పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.. చివరకు నమ్మిన...

Reporter Vs Media Boss: ఆర్టీఐ కమిషనర్ పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.. చివరకు నమ్మిన మీడియా అధినేతే వెన్నుపోటు పొడిచాడిలా..

Reporter Vs Media Boss: ఆయన ఓ సీనియర్ పాత్రికేయుడు. తెలుగులో ఉన్న ప్రముఖ దినపత్రికలలో పనిచేశాడు. అగ్రస్థానంలో ఉన్న ఓ పత్రికలో పుష్కర కాలం పాటు స్టేట్ బ్యూరోలో రిపోర్టర్ గా పనిచేశాడు. అప్పట్లో ఓ పార్టీ బీట్ చూశాడు. ఆ పార్టీ అధినేతకు అత్యంత దగ్గర వ్యక్తిగా మారిపోయాడు. ఆ తర్వాత ఆ పత్రిక నుంచి బయటకు వచ్చి మరో పత్రికలో చేరాడు. పైగా ఆయన సామాజిక వర్గం.. ఆ పత్రిక అధినేత సామాజిక వర్గం ఒకటే కావడంతో.. ఆ రిపోర్టర్ కు విపరీతమైన స్వేచ్ఛతో పనిచేసుకునే అవకాశం లభించింది. గతంలో ఆ పత్రికలో పనిచేసినప్పుడు చూసిన బీట్ నే మళ్లీ ఈ పత్రికలో ఆయనకు ఇచ్చారు. ఆ రిపోర్టర్ అనుకున్నట్టు అన్ని జరిగిపోతే ఈ కథనం రాయాల్సిన అవసరం వచ్చేది కాదు.

Also Read: ఏపీకి అవార్డుల పంట.. హస్తకళలు, ఆహార ఉత్పత్తులకు అరుదైన గుర్తింపు!*

ఆ రిపోర్టర్ ఆ పార్టీ బీట్ చూసేటప్పుడు లోతైన విషయాలు రాసేవాడు. ఆ విషయాలు మీడియా వర్గాలలో చర్చకు దారి తీసేవి. చివరికి పార్టీ నిర్ణయాలను కూడా మార్చేవి. ఇలా తన సూటితనం, నిక్కచ్చి తత్వంతో ఆ పార్టీ నేతలకు అతడు అత్యంత ఇష్టమైన పాత్రికేయుడిగా అతడు మారిపోయాడు.. ఇదే క్రమంలో పార్టీ అధినేతకు కూడా అత్యంత దగ్గర వ్యక్తిగా మారిపోయాడు. సహజంగా పాత్రికేయులు ఇటువంటి గౌరవాన్ని కోరుకుంటారు. ఆ గౌరవం లభిస్తున్న నేపథ్యంలో ఆ పాత్రికేయుడు కూడా తన సంస్థ కోసం రకరకాలుగా పనిచేశాడు. ఇతడి ద్వారా ఆ పత్రిక అధినేత రకరకాల పనులు చేయించుకున్నాడు. భారీగానే లబ్ధి పొందాడు. ఇక ఇటీవల ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఐదు సంవత్సరాలపాటు అనేక ఇబ్బందులు పడిన తర్వాత.. మొత్తానికి వేరే పార్టీలతో పొత్తు పెట్టుకుని అధికారాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఆ బీట్ రిపోర్టర్ మళ్లీ బిజీ అయిపోయాడు. ఆ పార్టీ అధినేత ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండడంతో.. ఆ రిపోర్టర్ వ్యాల్యూ అమాంతం పెరిగిపోయింది. అయితే ఇక్కడే ఆ పత్రిక అధినేత తన చాకచక్యాన్ని ప్రదర్శించాడు.

మీడియా ఫీల్డ్ లో ఎక్స్టెన్షన్ అనేది సర్వసాధారణం. మీడియాకు వయసు అనేది వర్తించదు. ఒకవేళ అదే గనుక ప్రమాణమైతే ఇప్పుడు మీడియాలో దాదాపు సగం కీలక పోస్టులు ఖాళీ అవుతాయి. ఆ రిపోర్టర్ కూడా రిటైర్మెంట్ వయసుకు వచ్చాడు. అయితే తన సర్వీస్ కొనసాగిస్తారని అతడు భావించాడు. ఆ మీడియా అధినేత మాత్రం దానికి ఒప్పుకోలేదు. పైగా మొహమాటం లేకుండానే మీ సేవలు అవసరం లేదని చెప్పేశాడు.. దానికి కారణం లేకపోలేదు. గత ఏడాది అధికారంలోకి వచ్చిన ఆ పార్టీలో అనేక రకాల సమస్యలు వెలుగు చూస్తున్నాయి. వాటిని ఆ రిపోర్టర్ రాయడానికి ప్రయత్నించాడు.. అది ఆ మీడియా అధినేతకు నచ్చలేదు. సమస్యలను పక్కనపెట్టి సానుకూలంగా వార్తలు రాయాలని చెప్పాడు. దానికి ఆ రిపోర్టర్ కాస్త నొచ్చుకున్నాడు. ఇదే విషయాన్ని ఆ మీడియా అధినేతకు తెలియడంతో అప్పటినుంచి అతని మీద ఆగ్రహం పెంచుకున్నాడు. అతడి రిటైర్మెంట్ కు ఓకే చెప్పాడు. దీంతో ఆ పత్రిక నుంచి ఆ రిపోర్టర్ వెళ్లిపోయాడు.

ప్రస్తుతం ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రితో ఆ రిపోర్టర్ కు గట్టి సంబంధాలు ఉన్న నేపథ్యంలో.. ఆర్టిఐ కమిషనర్ పదవి కోసం ప్రయత్నిస్తున్నాడు.ఇందులో భాగంగానే ముఖ్యమంత్రిని కలిశాడు..ఆ పదవి ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఒప్పుకున్నప్పటికీ.. తన మాటను గతంలో దిక్కరించాడనే కారణంతో ఆ పత్రిక అధినేత ఆ రిపోర్టర్ కు ఆ పదవి రాకుండా అడ్డుపడుతున్నాడు..” నేను ఆ సంస్థలో పనిచేయడం లేదు.. పైగా పదవి విరమణ కూడా తీసుకున్నాను. అలాంటప్పుడు ఆ పోస్ట్ నాకు ఇస్తే ఇబ్బంది ఏముంది” అని ఆ రిపోర్టర్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడిగాడు. దానికి ” మా పార్టీకి కొన్ని అవసరాలు ఉంటాయి. మా ప్రభుత్వానికి కూడా అలాంటి అవసరాలు ఉన్నాయి. అర్థం చేసుకో” అంటూ ఆ ముఖ్యమంత్రి సమాధానం చెప్పేసరికి ఆ మాజీ రిపోర్టర్ కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. పైగా అవసరం ఉన్నప్పుడు వాడుకొని.. ఇప్పుడు వదిలేసాడని ఆ మీడియా అధినేత పై ఆ మాజీ రిపోర్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular