Whats Up: వాట్సాప్ నుంచి న్యూ అప్డేట్… ఈ పీచర్ తో ఏం చేయొచ్చంటే?

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వాట్సాప్ ను ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరికి వాట్సాప్ ఉంటుంది. తన యూజర్లను ఆకట్టుకునందుకు యాజమాన్యం ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్ పీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది.

Written By: Srinivas, Updated On : September 14, 2023 10:15 am

Whats Up

Follow us on

Whats Up: నేటి కాలంలో వాట్సాప్ వాడని వారు వెతికినా దొరకరు కావొచ్చు. ఏదో అవసరంతో మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ ను ఇన్ స్టాల్ చేసుకుంటున్నారు. ఈ యాప్ సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే వివిధ సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చిన మాతృసంస్థ బెటా తాజాగా మరో అప్డేట్ ను ఇచ్చింది. ఈ ఫీచర్ తో మనకు కావాల్సిన వ్యక్తులు, సంస్థల నుంచి నిత్య సమాచారం అందుకోవచ్చు. అంతకంటే ముందు దానిని ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. దానిని అప్డేట్ ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం..

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వాట్సాప్ ను ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరికి వాట్సాప్ ఉంటుంది. తన యూజర్లను ఆకట్టుకునందుకు యాజమాన్యం ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్ పీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. తాజాగా బ్రాడ్ కాస్ట్ తరహాలో వాట్సాప్ ఛానెల్స్ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనీ ద్వారా కోరుకున్న వ్యక్తులు, సంస్థల నుంచి అప్డేట్ ఎప్పటికప్పుడు పొందవచ్చు. అయితే దానిని ముందుగా ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రస్తుతం వాట్సాప్ వినియోగదారులు దీనిని ప్లేస్టోర్ నుంచి అప్డేట్ చేసుకోవాలి. ఇలా అప్డేట్ చేసుకున్న తరువాత అప్డేట్స్ అనే ట్యాబ్ ను స్క్రీన్ పై కనిపిస్తుంది. దీనిద్వారా మంన ఛానెల్స్ లిస్టును ఫాలో కావొచ్చు. ఈ ఛానెల్ అడ్మిన్, తమ ఫాలోవర్స్ కు టెక్ట్స్ , ఫొటోలు, వీడియోలు, పోల్స్, స్టిక్కర్లు పంపించుకోవచ్చు. సాధారణ చాట్ తో పోలిస్తే ఇది మెరుగైనదిగా యాజమాన్యం చెబుతోంది. అయితే మనం ఎవరిని ఫాలో అవుతున్నామో.. వారికి ఈ వివరాల తెలియవు.

ఇప్పటి వరకు పరిమిత సంఖ్యలో మాత్రమే మెసేజ్ లు , ఫొటోలు పంచించుకునే వీలుండేది. కానీ ఫీచర్ ను అప్డేట్ చేసిన తరువాత అపరిమితంగా సెండ్ చేసుకోవచ్చు. దీనిని అప్డేట్ చేసిన కొన్ని గంటల్లోనే ఇది అందుబాటులోకి వచ్చింది. ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్ తో ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో దీనిని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.