Bigg Boss 7 Telugu: బిగ్ బాస్: ఆ ఆరుగురికే అస్త్రాలు అనే మాస్టర్ ప్లాన్…అదిరిందయ్యా శివాజీ…

మొదటి టాస్క్ లో గెలిచి ఇంటి సభ్యుడిగా పవర్ అస్త్రాను సాధించాడు సంధిప్. అయితే ఇప్పుడు రెండోవారానికి సంబంధించిన పవర్ అస్త్ర సాధించడం కోసం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కు మొదట మాయ అస్త్ర అనే కొత్త టాస్క్ ని ఇచ్చారు.

Written By: Vadde, Updated On : September 14, 2023 10:23 am
Follow us on

Bigg Boss 7 Telugu: ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తో మొదలుపెట్టిన బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో అంత ఉల్టా పుల్టా గానే జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న రియాల్టీ షోస్ అన్నిటిలోకి ప్రేక్షకుల మనసుకు ఎంతో దగ్గరగా ఉన్నది బిగ్ బాస్. అయితే ప్రస్తుతం జరుగుతున్న సీజన్ లో ప్రతి ఒక్క ఎపిసోడ్ అంతకుమించి అన్నట్టు ఎంటర్టైన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ముగిసిన ఎపిసోడ్లో టాస్క్ ఎలా జరిగిందో చూద్దామా..

మొదటి టాస్క్ లో గెలిచి ఇంటి సభ్యుడిగా పవర్ అస్త్రాను సాధించాడు సంధిప్. అయితే ఇప్పుడు రెండోవారానికి సంబంధించిన పవర్ అస్త్ర సాధించడం కోసం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కు మొదట మాయ అస్త్ర అనే కొత్త టాస్క్ ని ఇచ్చారు. సందీప్ ను మినహాయించి మొత్తం ఇంటి సభ్యులను రెండు టీములుగా విభజించారు. ఇందులో రణధీర టీం లో అమర్‌దీప్, శివాజి, షకీలా, ప్రియాంక, ప్రిన్స్, శోభా శెట్టి సభ్యులు కాగా..గౌతమ్, ప్రశాంత్, రతికా, దామిని, శుభశ్రీ, తేజ మహాబలి టీం లో ఉన్నారు.

ఈ టాస్క్ కు నిర్వాహకుడిగా సందీప్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సాగిన ఫస్ట్ రౌండ్ లో ‘టగ్ ఆఫ్ వార్’ నిర్వహించగా…ఇందులో రణధీర టీం గెలిచి… ‘మాయ అస్త్ర’ను సంపాదించడం కోసం ఒక కీను సాధించారు. ఇప్పుడు రెండు జట్ల కు బిగ్ బాస్ లోని మలుపు లో ఉంది గెలుపు అనే నెక్స్ట్ టాస్ ఇవ్వడం జరిగింది. ఈ టాస్క్ లో భాగంగా స్పిన్ వీల్ తిప్పి… అందులో ఏ కలర్ వస్తే ఆ కలర్ బోర్డ్ పై రాసి ఉన్న విధంగా కంటెస్టెంట్ చేయాల్సి ఉంటుంది.

ఇక ఈ రెండో రౌండ్ ‘మలుపులో ఉంది గెలుపు’ టాస్కులో మొత్తం మూడు రౌండ్లు జరిపారు. ఇందులో భాగంగా నిర్వహించిన మొదటి రౌండ్ లో రణధీర టీమ్ నుంచి ప్రియాంక పై గౌతమ్ విజయం సాధించగా.. రెండవ రౌండ్లో మహాబలి టీం నుంచి ప్రశాంత్, శోభా శెట్టిపై విన్ అయ్యాడు. ఆటను డిసైడ్ చేసే మూడో రౌండ్లో మాత్రం పాపం ప్రిన్స్ యావర్ ముందు రతికా రోజ్ ఓడిపోయింది. ఇలా మూడు రౌండ్లలో రెండు రౌండ్లు విజయం సాధించిన రణధీర జట్టే గెలిచింది.

మాయా ఆసరా టాస్ ముగిసింది అని బిగ్ బాస్ తెలియపరచడంతో పాటు ఇందులో జరిగిన రెండు టాస్కులలో గెలిచిన రణధీర టీమ్ సభ్యులకు ఆరు మాయ అస్త్రాలను అందివ్వడం జరిగింది. అంటే ఈవారం జరగబోయే పవర్ అస్త్ర పోటీలకు మాయా అస్త్రాలను గెలిచిన ఈ ఆరుగురు సభ్యులు అర్హత పొందారు. అయితే ఇందులో శివాజీ రోల్ ఏంటి అని అనుకుంటున్నారా.. నిజానికి మాయ ఆస్త్ర టాస్క్ లో ఏ టీం గెలిచినప్పటికీ.. దొరికిన తాళాన్ని సరిగా దాచకపోతే ఫైనల్ స్టేజికి వెళ్లలేరు.

ఇది బాగా గ్రహించిన శివాజీ తమ జట్టు గెలిచిన తాళాలను ఎంతో భద్రంగా దాచడంలో సక్సెస్ అయ్యాడు. ఆ తాళాలు కనుక్కోవడం కోసం మహాబలి టీమ్ కిందా మీద పడిన సరే.. అవి వాళ్ళ చేతికి చిక్కలేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ల టీం ముందడుగు వేయగలిగింది.. శివాజీ తన తెలివితేటలు అంతా ప్రదర్శించి చేసిన ఈ పనితో ప్రస్తుతం అతనిపై ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.