Faria Abdullah: కొంతమంది సినిమాల్లో హీరోయిన్లుగా చేస్తున్నారు అంటే వాళ్ళని అసలు మనకు నచ్చదు.ఎందుకంటే వాళ్లు హీరోయిన్ మెటీరియల్ కాదు అని మనం అభిప్రాయపడుతూ ఉంటాం కానీ కొందరిని మాత్రం చూసినప్పుడు వీళ్ళు హీరోయిన్ గా చేస్తే బాగుంటుంది అని భయపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళలో ఫరీయ అబ్దుల్లా ఒకరు… ఈవిడ మే 28వ తేదీన 1998వ సంవత్సరంలో హైదరాబాదులో జన్మించారు. ఈవిడకి మొదటి నుంచి కూడా మోడలింగ్ అంటే చాలా ఇష్టం…దాంతోపాటు థియేటర్ ఆర్టిస్ట్ కూడా చేసేది,ఇక దాంతోపాటు యూటూబర్ గా కూడా చేసింది అలాగే నక్షత్ర అనే ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించింది.
ఇక ఫరీయా అబ్దుల్లా గురించి చెప్పాలంటే ఆవిడ అనుదీప్ డైరెక్షన్ లో వచ్చిన జాతి రత్నాలు అనే సినిమాలో నవీన్ పోలిశెట్టి పక్కన హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో ఆవిడకి మంచి అవకాశం వచ్చిందనే చెప్పాలి. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవడంతో ఆవిడ ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది ఇక ఈ సినిమా తర్వాత ఆమెకి తెలుగులో ఆఫర్లు వచ్చాయి కానీ వాటిలో కొన్నింటిని మాత్రమే సెలెక్ట్ చేసుకుని సినిమాలు చేస్తూ ముందుకెళ్తుంది. ఇక జాతి రత్నాలు సినిమా తర్వాత ఆమె రవితేజ హీరోగా వచ్చిన రావణాసుర అనే సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమా డైరెక్టర్ అయిన సుధీర్ వర్మ ఆ క్యారెక్టర్ కి ఫరియా అయితేనే బాగుంటుంది అని ఏరి కోరి మరి ఆమెను పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా అనుకున్నంతగా సక్సెస్ అవ్వలేదు అయినప్పటికీ ఫరియా అబ్దుల్లా చేసిన క్యారెక్టర్ కి మంచి పేరు వచ్చింది.ప్రస్తుతం ఈమె వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో చాలా బిజీగా ఉంది అయితే స్వతహాగా ఫరియా హైట్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఇండస్ట్రీలో హైట్ ఎక్కువగా ఉన్న హీరోలకి హీరోయిన్ గా బాగా సెట్ అవుతుంది అందులో భాగంగానే అల్లరి నరేష్ హీరోగా తన 61వ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే దాంట్లో హీరోయిన్ గా ఫరియా అబ్దుల్లా నటిస్తుంది…
ఇక ఈమె ఇప్పటికే నాగార్జున,నాగ చైతన్య హీరోలుగా వచ్చిన బంగర్రాజు సినిమాలో ఐటెం సాంగ్ కూడా చేసింది ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ రీసెంట్ గా ఆమె దిగిన కొన్ని ఫోటోలు నెట్టింట్లో చాలా వైరల్ గా మారాయి దాంతో ఆవిడ అభిమానులందరూ ఆవిడకి మెసేజ్ లు పెడుతున్నారు కొందరైతే ఫరియా ఐ లవ్ యు అంటూ ఫన్నీ మెసేజ్ లు కూడా పెడుతున్నారు. ఇలా ఆవిడ యూత్ లో చాలా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నరనే చెప్పాలి… ఇక ఈవిడకు ఫేవరెట్ హీరో అయినా రవితేజ తో రావణాసుర సినిమాలో నటించి రవితేజ తో నటించాలి అనే ఆవిడ డ్రీమ్ ని ఫుల్ ఫీల్ చేసుకున్నారు…