MG Windsor EV : ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు ఎంజీ మోటార్స్ సంస్థ గతేడాది సెప్టెంబర్‌లో విడుదల చేసిన విండ్సర్ ఈవీ అమ్మకాల జోరు ఆగడం లేదు. కేవలం కొన్ని నెలల్లోనే ఈ కారును 27,000 మందికి పైగా కొనుగోలు చేశారు. ఈ లెక్కలతో విండ్సర్ ఈవీ మనదేశంలో అత్యంత వేగంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారుగా అవతరించింది. విండ్సర్ ఈవీ, నెక్సాన్ ఈవీ నుండి క్రెటా ఈవీ వరకు అన్నింటినీ వెనక్కి నెట్టేసింది.
చిన్న నగరాల్లోనూ భారీ డిమాండ్
విండ్సర్ ఈవీ కేవలం పెద్ద సిటీల్లోనే కాకుండా టైర్ టు నగరాల్లోనూ అత్యంత ప్రాచుర్యం పొందింది. ఈ చిన్న పట్టణాల్లో ఎలక్ట్రిక్ కార్లకు భారీగా డిమాండ్ ఉంది. విండ్సర్ ఈవీ మొత్తం అమ్మకాల్లో దాదాపు 48 శాతం చిన్న నగరాల నుంచే వచ్చాయి. మొదట్లో ఈ ఎలక్ట్రిక్ కారును చిన్న 38 కిలోవాట్ బ్యాటరీతో రిలీజ్ చేశారు. తర్వాత, 2025 మే నెలలో విండ్సర్ ప్రో అనే పేరుతో పెద్ద 52.9 కిలోవాట్ బ్యాటరీతో ఒక మోడల్‌ను విడుదల చేశారు. మే 2025లో విడుదలైన 24 గంటల్లోనే కొత్త మోడల్‌కు 8,000బుకింగ్స్ వచ్చాయని కంపెనీ ప్రకటించింది.
Also Read : MG Windsor EV :తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు.. అమ్మకాల్లో విండ్సర్ రికార్డు
విండ్సర్ ఈవీ అన్ని మోడళ్లలో 38 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ మోటారు 134 బీహెచ్‌పీ పవర్, 200 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 331 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. ఇక విండ్సర్ ప్రో మోడల్‌లో పెద్ద 52.9 కిలోవాట్ బ్యాటరీ ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 449 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది. అయితే, ప్రో మోడల్ పవర్ మాత్రం మారలేదు.
విండ్సర్ ఈవీ ప్రత్యేకతలు
ఎంజీ విండ్సర్ కారులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. విశాలమైన కేబిన్ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ మోడల్‌లో యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి సదుపాయాలతో కూడిన 15.6 అంగుళాల టచ్‌స్క్రీన్, 9 స్పీకర్ల ఇన్‌ఫినిటీ సౌండ్ సిస్టమ్, ఆటో క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ గ్లాస్ రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటివి ఉన్నాయి.సేఫ్టీ కోసం ఈ ఎలక్ట్రిక్ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీల కెమెరా, హిల్ అసిస్ట్ వంటివి ఉన్నాయి.
Also Read: MG Windsor EV :టాటా, మారుతికి ముచ్చెమటలు పట్టిస్తున్న నయా ఎలక్ట్రిక్ కార్
విండ్సర్ ఈవీ డిజైన్
ఎంజీ విండ్సర్ ఈవీ ప్రత్యేకత ఏంటంటే.. దీని డిజైన్ చాలా డిఫరెంటుగా ఉంటుంది. ఇది ఇతర ఎలక్ట్రిక్ కార్ల కంటే భిన్నంగా కనిపిస్తుంది. దీనిలో హ్యాచ్‌బ్యాక్, ఎంపీవీ, కాంపాక్ట్ ఎస్‌యూవీ స్టైల్స్‌ను కలిపినట్లు ఉంటుంది. ముందు భాగంలో డేటైమ్ రన్నింగ్ లైట్లు, ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు ఉంటాయి. అలాగే, ఎంజీ కంపెనీ లోగో కూడా ఉంది. అల్లాయ్ వీల్స్‌తో పాటు, కొన్ని మోడళ్లలో బ్లాక్ పిల్లర్స్ కూడా ఉంటాయి. ఎంజీ విండ్సర్ ఈవీ కంపెనీ తీసుకొచ్చిన మొదటి కారు వచ్చిన మొదటి కారు. దీనికి ‘బ్యాటరీ-ఎ-ఎ-సర్వీస్’ సదుపాయం ఉంది. ఇది ఎలక్ట్రిక్ కారు ధరను చాలా తగ్గించింది. ‘బ్యాటరీ-ఎ-ఎ-సర్వీస్’ ప్యాకేజీతో ఎంజీ విండ్సర్ ఈవీ ధర రూ.10 లక్షల నుంచి టాప్ మోడల్ ‘ఎసెన్స్ ప్రో’కి రూ.13.10 లక్షల మధ్య ఉంటుంది. అదే విండ్సర్ ఈవీని పూర్తిగా కొనుగోలు చేస్తే దాని ధర రూ.14 లక్షల నుంచి రూ.18.10 లక్షల మధ్య ఉంటుంది.