Roads: ఒక దేశ అభివృద్ధిని అక్కడి రోడ్లే వెల్లడిస్తాయి. రోడ్లు బాగుంటేనే కంపెనీలు వస్తాయి. ఉద్యోగాలు లభిస్తాయి. అనుబంధ రంగాలు ఏర్పాటు అవుతాయి. తద్వారా చాలామందికి ఉపాధి లభిస్తుంది. ప్రభుత్వానికి కూడా పన్నుల రూపంలో ఆదాయం లభిస్తుంది. జిడిపి పెరుగుతుంది. ఇలా వచ్చిన ఆదాయం ప్రభుత్వం వేరే పనులకు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది.
పాశ్చాత్య దేశాలు రోడ్ల నిర్మాణానికి భారీగా నిధులు ఖర్చు చేస్తుంటాయి. గతంలో ఈ దేశాలలో సంప్రదాయ విధానాలలో రోడ్లు నిర్మించేవారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో వచ్చిన మార్పు వల్ల ఆధునిక పద్ధతిలో రోడ్లను నిర్మిస్తున్నారు. వ్యర్ధాలను సైతం రోడ్ల నిర్మాణానికి ఉపయోగిస్తున్నారు. దీనివల్ల రోడ్లు పటిష్టంగా ఉంటున్నాయి. అంతేకాదు వ్యర్ధాలకు అర్థం తీసుకురావడం వల్ల పర్యావరణ కాలుష్యం కూడా తగ్గిపోతుంది. ఇటీవల కాలంలో తారుకు ప్రత్యామ్నాయంగా వేరే పదార్థాలను వాడుతూ విదేశాలలో రోడ్లు నిర్మిస్తున్నారు. వర్షాలు, ఇతర ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు రోడ్లు చెక్కుచెదరడం లేదు. కానీ మనదేశంలో రోడ్ల నిర్మాణాల్లో నాణ్యత ఉండడం లేదు. హైవేలు నిర్మిస్తున్నామని, ఇతర రోడ్లు కూడా యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ నాణ్యత అంత గొప్పగా ఉండడం లేదు. దీంతో ప్రకృతి విపత్తులు చోటు చేసుకున్నప్పుడు రోడ్లు సర్వనాశనం అవుతున్నాయి. నామరూపాలు లేకుండా పోతున్నాయి.
విదేశాలలో రోడ్లు నిర్మించే క్రమంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఇందులో భాగంగా మనుషులను తక్కువ ఉపయోగిస్తూ.. యంత్రాలను ఎక్కువగా వాడుతూ రోడ్లు నిర్మిస్తున్నారు.. తారు, ఇతర పదార్థాలను యంత్రాలే కలుపుతున్నాయి. ఆ మిశ్రమాన్ని రోడ్డు నిర్మాణానికి ఉపయోగిస్తున్నాయి. ఇలా నిర్మించిన రోడ్డు పటిష్టంగా ఉంటుందని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఈ రోడ్డు నిర్మాణంలో వ్యర్ధాలను కూడా ఉపయోగిస్తున్నామని.. తద్వారా పర్యావరణంపై ఒత్తిడి పడకుండా చూస్తున్నామని విదేశీ అధికారులు అంటున్నారు. విదేశాలలో ఓ ప్రాంతంలో యంత్రాలతో నిర్మిస్తున్న ఓ రోడ్డుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తున్నాయి. చూస్తుండగానే అత్యంత భారీ రోడ్డు నిర్మాణాన్ని ఆ యంత్రం చేపడుతోంది. మనుషులు కేవలం ఆ యంత్రాన్ని పర్యవేక్షిస్తున్నారు. అత్యంత కఠినమైన పరిస్థితిలో ఆ యంత్రం పనిచేస్తోంది. వాస్తవానికి అలాంటి పరిస్థితుల్లో మనుషులు పనిచేయలేరు. ఒకవేళ పని చేసినా రోడ్డు నిర్మాణంలో నాణ్యత అంతగా ఉండదు. నాణ్యతను పెంపొందించడానికే ఇలా మనుషులతో కాకుండా యంత్రాలతో పని చేయాల్సి వస్తోందని అక్కడి అధికారులు అంటున్నారు.
మనదేశంలో కూడా ఇలా పూర్తిస్థాయిలో యంత్రాలను ఉపయోగించి రోడ్డు నిర్మాణం చేపడితే బాగుంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కఠినమైన ప్రాంతాలలో రోడ్డు నిర్మాణం చేపట్టడం ఒక రకంగా సవాలే. అటువంటి చోట యంత్రాల ద్వారా మాత్రమే రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు ఆస్కారం ఉంటుంది. విదేశీ టెక్నాలజీ మనం కూడా స్వీకరించగలిగితే దేశవ్యాప్తంగా రోడ్లను మనం మరింత వేగవంతం చేయవచ్చని విశ్లేషకులు అంటున్నారు.
Indian Roads Needs This Technology & Equipment! pic.twitter.com/GJhLOsCE6t
— Hi Hyderabad (@HiHyderabad) October 17, 2025