Shreyas Iyer: టీమిండియాలో శ్రేయస్ అయ్యర్ విభిన్నమైన ఆటగాడు. మైదానంలో ఉన్నంత సేపు దూకుడుగా ఆడుతుంటాడు. తనదైన శైలిలో ఇన్నింగ్స్ నిర్మిస్తుంటాడు. తగ్గాల్సిన చోట తగ్గుతుంటాడు. నెగ్గాల్సిన చోట నెగ్గుతుంటాడు. ఆటపై విపరీతమైన మమకారం చూపిస్తుంటాడు. జట్టుపై అచంచలమైన ప్రేమను వ్యక్తం చేస్తుంటాడు. అందుకే అతడిని యాంగ్రీ క్రికెటర్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు.
అయ్యర్ అద్భుతమైన ఆటగాడు. అతడికి సరైన స్థాయిలో అవకాశాలు వస్తే మరింత ఆకట్టుకుంటాడు. మేనేజ్మెంట్ లో ఉన్న రాజకీయాల వల్ల అతడికి అవకాశాలు వస్తూ పోతున్నాయి. ఎంతో సామర్థ్యం ఉన్న ఏ అతడికి అవకాశాలు రాకపోవడం పట్ల అభిమానులు మేనేజ్మెంట్ పట్ల నిత్యం ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉంటారు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆకట్టుకున్నప్పటికీ టీ 20 వరల్డ్ కప్ లో అయ్యర్ కు అవకాశం ఇవ్వలేదు.. ఇంగ్లాండ్ సిరీస్ లో అవకాశం కూడా లభించలేదు. ప్రస్తుత ఆస్ట్రేలియా సిరీస్ లో అయ్యర్ కు అవకాశం లభించింది. మేనేజ్మెంట్ తీరు పట్ల అయ్యర్ అభిమానులు కాస్తలో కాస్త సంతృప్తి వ్యక్తం చేశారు.
జట్టుతో కలిసి అయ్యర్ ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు. అక్కడ ప్రాక్టీస్ లో మునిగి తేలుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అయ్యర్ మైదానంలో కనిపిస్తున్న నేపథ్యంలో అతడి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ముఖ్యంగా పంజాబ్ అభిమానులు అయ్యర్ ను సోషల్ మీడియాలో వేయి నోళ్ళ కొనియాడుతున్నారు. అయ్యర్ కూడా రెట్టించిన ఉత్సాహంతో మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నాడు.. అయ్యర్ ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాలను అతడి అభిమానులు సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు అయ్యర్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయినప్పటికీ అభిమానులు ఆ వీడియోను తెగ సర్కులేట్ చేస్తున్నారు.
ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన తర్వాత అయ్యర్ అభిమానుల్లో ఆనందం పెరిగిపోయిన విషయం తెలిసిందే. వ్యక్తిగతంగా అయ్యర్ కూడా ఆనంద పడ్డాడు. ముఖ్యంగా అయ్యర్ మాతృమూర్తి మరింత హర్షం వ్యక్తం చేసింది. ఆస్ట్రేలియా టూర్ వెళ్తున్న అయ్యర్ కు ఘనంగా సెండ్ ఆఫ్ ఇచ్చింది. అయ్యర్ విదేశాల కు వెళ్ళే ప్రతి సారీ అయ్యర్ కు అతడి మాతృమూర్తి సెండ్ ఆఫ్ ఇస్తుంది. అతడి నుదుటిమీద ముద్దు కూడా పెడుతుంది. వాస్తవానికి అయ్యర్ తల్లిదండ్రుల మాట జవ దాటడు. అయ్యర్ అంటే అతడి తల్లిదండ్రులకు విపరీతమైన ఇష్టం. నేటి కాలంలో ఒక స్థాయి వచ్చిన తర్వాత చాలామంది సెలబ్రిటీలు తల్లిదండ్రులను దూరం పెడుతున్నారు. కానీ అయ్యర్ అలా కాదు. ఈ విషయంలో చాలా మంది క్రికెటర్లు అయ్యర్ ను చూసి నేర్చుకోవాలని విశ్లేషకులు అంటున్నారు.
Shreyas Iyer is 30 years old & everytime he goes outside mumbai his mom comes to airport to drop him & he never forgets to take blessings of his mom & dad before saying bye.
Shreyas is a great rolemodel for everyone on how to treat your parents❤️ pic.twitter.com/G034J7WZQd
— Rajiv (@Rajiv1841) October 17, 2025