One Nation One Election: దేశంలో రాజకీయ వ్యవస్థ అన్నింటికి ఆటంకంగా మారుతోంది. ఒకప్పుడు చాలా దేశాలకన్నా ముందు ఉన్న మన దేశం.. ఇప్పుడు మాత్రం వెనుకబడింది. దీనికి కారణం రాజకీయాలు.. తరచూ ఎన్నికలు జరగడమే. ఒప్పుడు వెనుకబడిన చైనా.. ఒకే పార్టీ అధికారంలో ఉండడంతో అభివృద్ధిలో దూసుకుపోతోంది. దీంతో మన దేశ అభివృద్ధికి ఆటంకం రాజకీయాలే అని చాలా మంది భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ కూడా దీనినే నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే వన్ నేషన్, వన్ ఎలక్షన్‌ను తెరపైకి తెచ్చారు. మరి ఇది ఏమేరకు వర్కవుట్ అవుతుందో తెలుసుకుందాం..
ఏటా ఎన్నికలు..
దేశంలో ఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. గ్రామస్థాయి నుంచి అసెంబ్లీ వరకూ ఎన్నికలు జరుగుతాయి. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు చాలా మంచిదే. కానీ, ఏటా ఎన్నికలు నిర్వహించడం, వీటితోపాటు ఇతర సంఘాలకు ఎన్నిలు జరగడంతో నేతలు అభివృద్ధికన్నా.. రాజకీయాలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఇక ఎన్నికలు ఏవైనా రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుంది. మరోవైపు వ్యయం అధికంగా ఖర్చు చేయాల్సివస్తోంది. తెలంగాణ విషయం చూసుకుంటే 2023లో అసెంబ్లీ ఎన్నికలుజరిగాయి. ఆరు నెలల తర్వాత లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉంది. వచ్చే ఏడాది జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరుగుతాయి. తర్వాత మున్సిపాలిటీ ఎన్నికలు జరగాలి. 2025 మొత్తం ఎన్నికలకే సరిపోతుంది. మరోవైపు ఆర్థిక భారం పడుతుంది. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.
అవినీతి, అక్రమాలు..
ఇక ఎన్నికల వ్యవయం పెరుగుతుండడంతో నేతలు అక్రమాలు, అవినీతికి పాల్పడుతున్నారు. అడ్డదారులు తొక్కుతున్నారు. ఎన్నికల కోసమే డబ్బులు పోగుచేసుకుంటున్నారు. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు ఎన్నికయ్యే నేతల్లో చాలా మంది ఇప్పుడు సంపాదనే లక్ష్యంగా పోటీ పాలన సాగిస్తున్నారు. దీంతో రాజకీయాలు కాస్ట్‌లీ అయిపోయాయి. దీంతో నేతలు అవినీతి సొమ్మునే ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారు. 2024 పార్లమెంటు ఎన్నికలు ముగిసిన ఆరు నెలల్లోనే ఐదు రాష్ట్రా్టల్లో ఎన్నికలు జరిగాయి. మరో రెండు నెలల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఆ తర్వాత బిహార్, ఆ తర్వాత మరో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ పరిస్థితి మార్చాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే వన్ నేషన్, వన్ ఎలక్షన్ నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు ప్రత్యేక కమిటీ వేసి నివేదిక కోరింది. కమిషన్ అన్ని పార్టీలతో చర్చించి నివేదిక అందించింది. తాజాగా వన్ నేషన్, వన్ ఎలక్షన్‌కు కేబినెట్ ఆమోదం లభించింది. ఇక పార్లమెంట్‌లో బిల్లు పాస్ చేయడమే తరువాయి.
18 రాజ్యాంగ సవరణలు..
దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి రాజ్యాంగం సవరించాల్సి ఉంటుంది. సుమారు 18 సవరణలు అవసరమని కమిషన్ సూచించింది. స్వాతంత్య్రం వచ్చినప్పుడు జమిలీ ఎన్నికలే జరిగేవి. కానీ ప్రభుత్వాలు కూలిపోవడం, రాజకీయ అనిశ్చితితో ముందస్తు ఎన్నికలకు వెళ్లడం, ప్రభుత్వాలు రద్దు చేయడం వంటివి జరుగుతున్నాయి. దీంతో ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయో తెలియడం లేదు. ఫలితంగా దీనిని సరిచేయాలంటే 18 రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. ముందు కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాల పరిమితిని తగ్గించాలి.
అనుకుంటే చేయగలదు..
కేంద్రం సామర్థ్యం చూసుకుంటే.. రాజ్యాంగ సవరణలు అంత ఈజీ కాదు. అయితే బీజేపీ అనుకుంటే సాధిస్తుంది. ఎంత బలం అన్నది సమస్య కాదు. ఓటింగ్ అవసరమైతే… మెజారిటీ సాధిస్తుంది. బిల్లు ఆమోదించినా అమలు చేయడంలో అనేక సవాళ్లు ఉంటాయి. ప్రక్రియ ప్రారంభిస్తే కనీసం మూడు నాలుగేళ్ల సమయం పడుతుంది. ఎన్నికల తర్వాత అసలు సవాళ్లు ఎదురవుతాయి.
ఆచరణ బాగుంటే మంచిదే..
ఆలోచన బాగుంది కానీ ఆచరణ కూడా బాగుండాలి. అనిశ్చితి ఉంటే ఏం చేయాలి, ప్రభుత్వాలు మధ్యలో కూలితే ఏమమువుతంది అన్నది కూడా స్పష్టత ఇవ్వాలి. సంకీర్ణాలు వస్తే పరిస్థితి ఏంటి అన్నది కూడా తెలియాలి. ఇందుకు జనంలో అవగాహన రావాలి. వీటిపైనే వన్ నేషన్ – వన్ ఎలక్షన్ విధానం సక్సెస్ అవుతుందా లేదా అన్నది ఆధారపడి ఉంటుంది.