Akhanda 2: రియాల్టీకి దూరంగా ఉన్న సన్నివేశాలను చూసినప్పుడు కొంచెం అతిగా అనిపిస్తోంది. హీరో ఏంటి అలా కొట్టడం ఏంటి? ఇలా దూకడం ఏంటి? అంటూ కొన్ని విమర్శలైతే వస్తాయి. కానీ బాలయ్య ఏది చేసిన కూడా అది అద్భుతమే…ఆయన యాక్షన్ సన్నివేశాల మీద ఎవ్వరు కామెంట్స్ చేయరు. కారణం ఏంటంటే బాలయ్య అంటే అందరికి ఇష్టం… కొంతమంది ఆయన సినిమాలు చూసి రిలాక్స్ అవుతుంటారు. ప్రస్తుతం బాలయ్య – బోయపాటి శ్రీను డైరెక్షన్ లో చేసిన ‘అఖండ 2’ సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వాల్సింది. కానీ కొన్ని అనుకోని కారణాలవల్ల ఈ సినిమా పోస్ట్ పోన్ అయింది.
14 రీల్స్ ప్రొడ్యూసర్స్ అయిన రామ్ ఆచంట, గోపి ఆచంట ఇద్దరు ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ కి దాదాపు 50 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. ఆ మనీ చెల్లిస్తే సినిమా రిలీజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం ప్రొడ్యూసర్స్ ఆ మనీ చెల్లించడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు.
ఇక ఇదంతా చూసిన బాలయ్య అభిమానులు మాత్రం తీవ్రమైన నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే బాలయ్య అభిమాని ఒకరు ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ వాళ్లకు 4 కోట్ల రూపాయల చెక్ ను రాసి పంపించాడట. ఇక ప్రస్తుతం ఆ చెక్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది… మొత్తానికైతే బాలయ్య అభిమానులు వేరే రేంజ్ లో ఉన్నారంటూ అందరు కామెంట్స్ చేస్తుండటం విశేషం…
ఇక ఇప్పటి వరకు ఇండియాలో ఏ హీరోకి లేని అభిమానులు బాలయ్య బాబుకు ఉన్నారంటూ సినిమా విమర్శకులు సైతం కామెంట్స్ చేస్తుండటం విశేషం… బాలయ్య సైతం తన అభిమానుల ఇబ్బందిని చూడలేక వీలైనంత తొందరగా సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నాడు…ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అనేది తెలియాల్సి ఉంది…ఈ నెలలో వస్తోందా లేదంటే నెక్స్ట్ ఇయర్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది…