Top 10 Most Luxurious Cities: ప్రపంచంలో అనేక సంస్థలు వివిధ దేశాలకు వివిధ అంశాల్లో ర్యాంకులు ఇస్తుంటాయి. కొన్ని ప్రశాంతతకు, కొన్ని ప్రకృతి రమణీయతకు, కొన్ని ఎయిర్ పోర్టులకు, కొన్ని లగ్జరీ లైఫ్‌కు ప్రతీకగా ఉన్నాయి. ఇక కొన్ని అవినీతిలో, కొన్ని పేదరికంలో ఉన్నాయి. 2025 సంవత్సరానికి జులియస్ బేర్ గ్లోబల్ హెల్త్ అండ్ లైఫ్‌స్టైల్ సంస్థ లగ్జరీ దేశాల జాబితాను విడుదల చేసింది. ఇందులో టాప్ పది దేశాలు ఇవీ..భారత్‌కు ఈ జాబితాలో చోటు దక్కలేదు.
సింగపూర్ నంబర్ వన్
లగ్జరీ నగరాల జాబితాలో సింగపూర్ వరుసగా రెండోసారి మొదటి స్థానంలో నిలిచింది. 2024లో కూడా అగ్రస్థానంలో ఉంది. ఖరీదైన ఆకాశ హర్మ్యాలు, కార్లు, ట్రెడ్‌మిల్ ధరలతో ప్రఖ్యాతి సంతరించుకుంది.
లండన్ రెండో స్థానంలో
గత ఏడాది మూడో స్థానంలో ఉన్న బ్రిటన్ రాజధాని ఈసారి రెండో స్థానం సాధించి ఖరీదైన కంటి చికిత్స, ఎంబీఏ, విద్యపై పేరుగాంచింది. కార్లు యిక్కడ చౌకగా లభిస్తాయి.
హాంకాంగ్ మూడోస్థానం..
గతేడాది రెండో స్థానంలో ఉన్న హాంకాంగ్ ఈసారి మూడోస్థానంలో నిలిచింది. లాయర్ చదువు ఖర్చుతో పాటు షాంపైన్ ధరల విషయంలో చౌకగా నిలిచింది.
మొనాకో నాలుగో స్థానం..
గతేడాదితో పోలిస్తే రెండు స్థానాలు పడిపోయినా మొనాకో ఆస్తుల ధరలు, ఎంబీఏ చదువు రంగంలో అత్యంత ఖరీదైన నగరంగా ఉంది. ఇక్కడ షాంపైన్ ధరలు కూడా తక్కువ.
జ్యూరిచ్ ఐదో స్థానం..
గతేడాది ఆరో స్థానంలో ఉన్న స్విట్జర్లాండ్ నగరం, ఎంబీఏ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఖర్చుల విషయంలో ముందంజలో ఉంది. ఇక్కడ విద్యా ఖర్చులు ఎక్కువగా ఉన్నా వాటితో సహ అర్ధ సహజమైన ధరలతో ఇతర విషయాలు అందుబాటులో ఉన్నాయి.
షాంఘై.. ఆరోస్థానం..
శీఘ్రంగా అభివృద్ధి చెందుతున్న చైనా నగరం ఇది. ప్రత్యేక డిగస్టేషన్ డిన్నర్ ఖర్చులు ఉన్న చోటు. షాంపైన్ ధరలు ఇక్కడ చౌకగా ఉండటం గమనార్హం.
దుబాయి ఏడోస్థానం..
గతేడాది 12వ స్థానంలో ఉన్న యూఏఈ నగరం, ప్రస్తుతం ఏడో స్థానంలోకి ఎదిగింది. ఇక్కడ విద్య, ప్రయాణ వసతులలో మరింత ఖర్చులుగా మారింది.
న్యూయార్క్ ఎనిమిదో స్థానం..
అమెరికా నగరం తాజా ర్యాంక్‌లో కాస్త దిగజారినా, హోటల్ సూట్ల ధరలు అత్యంత ఎక్కువగా ఉన్నాయి. టెక్ పరిశ్రమ జీతాలు మాత్రం తక్కువగా ఉన్నాయి.
ప్యారిస్ తొమ్మిదోస్థానం…
ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ ఎంబీఏ, ప్రైవేట్ విద్యాసంస్థల ఖర్చులు అధికంగా ఉండగా, పార్లర్ స్పా సేవల ధరలు కూడా ఎక్కువగా ఉన్నాయి.
మిలాన్ పదోస్థానం..
ఇటలీ ఫ్యాషన్ కేంద్రం ఎంబీఏ, కాఫీ ధరలు మరియు బిజినెస్ క్లాస్ ప్రయాణాల్లో చౌకగా నిలిచింది. తొలిసారిగా టాప్–10 జాబితాలోకి చేరింది.
20వ స్థానంలో ముంబై..
భారత్‌లోని ఏ నగరానికి టాప్ – 10లో చోటు దక్కలేదు. కానీ టాప్ – 20లో మన ఆర్థిక రాజధాని ముంబై నగరం నిలిచింది. 20వ స్థానంలో ఉంది.