హైదరాబాద్ వాసులకు అదిరిపోయే శుభవార్త.. ఉచితంగా వైఫై..?

ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ల వాడకం అంతకంతకూ పెరగడంతో వైఫైని వినియోగించుకునే వారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. పనిమీద బయటకు వెళ్లినవారు వైఫై లేకపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు పడుతుంటారు. అయితే యాక్ట్ ఫైబర్ నెట్ హైదరాబాద్ వాసులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. హైదరాబాద్ లోని మూడు వేల రద్దీ ప్రాంతాల్లో యాక్ట్ ఫైబర్ నెట్ ఈ సేవలను అందుబాటులోకి వచ్చింది. మంత్రి కేటీఆర్ ఫ్రీ వైఫై సేవలను లాంఛనంగా ప్రారంభించారు. మంత్రి కేటీఆర్ […]

Written By: Navya, Updated On : August 5, 2021 7:35 pm
Follow us on


ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ల వాడకం అంతకంతకూ పెరగడంతో వైఫైని వినియోగించుకునే వారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. పనిమీద బయటకు వెళ్లినవారు వైఫై లేకపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు పడుతుంటారు. అయితే యాక్ట్ ఫైబర్ నెట్ హైదరాబాద్ వాసులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. హైదరాబాద్ లోని మూడు వేల రద్దీ ప్రాంతాల్లో యాక్ట్ ఫైబర్ నెట్ ఈ సేవలను అందుబాటులోకి వచ్చింది.

మంత్రి కేటీఆర్ ఫ్రీ వైఫై సేవలను లాంఛనంగా ప్రారంభించారు. మంత్రి కేటీఆర్ బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఈ సేవలను ప్రారంభించారు. యాక్ట్ ఫైబర్ నెట్ సీఈవో బాల మల్లాదికి మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. నెలకు 3 లక్షల మంది ఈ ఓపెన్ వైఫైని వినియోగించుకునే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. 45 నిమిషాల పాటు ఉచితంగా వైఫైని వినియోగించుకునే అవకాశం ఉంది.

ఫ్రీ వైఫై సేవల వల్ల హైదరాబాద్ వాసులకు భారీగా ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు. వర్క్ ఫ్రం హోం వల్ల, విద్యార్థులు ఆన్ లైన్ క్లాసుల కోసం ఇంటికే పరిమితం కావడం వల్ల ఇంటర్నెట్ వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. మన దేశంలోని అతిపెద్ద పబ్లిక్ వైఫై ఇదే కావడం గమనార్హం. వైఫై సేవలు అందుబాటులోకి రావడం వల్ల ప్రజలకు మరింత ఎక్కువగా ప్రయోజనం చేకూరనుంది.

తెలంగాణ ప్రభుత్వం సైతం ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కొత్తకొత్త సేవలను అందుబాటులోకి తెస్తోంది. ఈ కార్యక్రమంలో ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, మరికొందరు పాల్గొన్నారు.