https://oktelugu.com/

పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. రూ.లక్ష అడ్వాన్స్ తీసుకునే ఛాన్స్..?

ఈపీఎఫ్‌వో పీఎఫ్ సబ్ స్క్రైబర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురైన వాళ్లకు కోవిడ్ 19 అడ్వాన్స్ తీసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈపీఎఫ్‌వో స‌బ్‌స్క్రైబ‌ర్ రూ.ల‌క్ష వ‌ర‌కు కరోనా, ఇతర ప్రాణాంతక వ్యాధుల చికిత్స కొరకు డబ్బులను తీసుకునే అవకాశం ఉంటుంది. ఈపీఎఫ్ స‌బ్‌స్క్రైబ‌ర్లు అడ్వాన్స్ విత్ డ్రా చేసుకోవ‌డానికి హాస్పిటలైజేషన్ ఖర్చు విషయంలో ఎటువంటి అంచనాలను సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆన్‌లైన్‌లో ఈపీఎఫ్‌వో పోర్ట‌ల్‌లో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 5, 2021 / 08:01 PM IST
    Follow us on


    ఈపీఎఫ్‌వో పీఎఫ్ సబ్ స్క్రైబర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురైన వాళ్లకు కోవిడ్ 19 అడ్వాన్స్ తీసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈపీఎఫ్‌వో స‌బ్‌స్క్రైబ‌ర్ రూ.ల‌క్ష వ‌ర‌కు కరోనా, ఇతర ప్రాణాంతక వ్యాధుల చికిత్స కొరకు డబ్బులను తీసుకునే అవకాశం ఉంటుంది. ఈపీఎఫ్ స‌బ్‌స్క్రైబ‌ర్లు అడ్వాన్స్ విత్ డ్రా చేసుకోవ‌డానికి హాస్పిటలైజేషన్ ఖర్చు విషయంలో ఎటువంటి అంచనాలను సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉండదు.

    ఆన్‌లైన్‌లో ఈపీఎఫ్‌వో పోర్ట‌ల్‌లో లాగిన్ కావడం ద్వారా క్లయిమ్ కోసం ప్రాసెస్ ను చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. మెడిక‌ల్ ఎమ‌ర్జెన్సీల కోసం ఈపీఎఫ్‌వో నుంచి లక్ష రూపాయల వరకు అడ్వాన్స్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. లక్ష రూపాయలు అడ్వాన్స్ తీసుకునే వాళ్లు మొదట https://unifiedportalmem.epfindia.gov.in/memberinterface వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

    ఫామ్-31,19,10 సీ, 10 డీ ఫామ్ లను ఆన్ లైన్ సర్వీసులకు వెళ్లి క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత బ్యాంక్ ఖాతాను నమోదు చేసుకుని ప్రొసీడ్ ఫర్ ఆన్‌లైన్ క్లెయిమ్ ను క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఫామ్ 31ను ఎంపిక చేసుకుని మ‌హ‌మ్మారి (కోవిడ్‌-19) ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అవసరమైన సొమ్ము నంబ‌ర్ న‌మోదు చేసి స్కాన్ చేసిన చెక్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

    ఆ తర్వాత గెట్ ఆధార్ ఓటీపీపై క్లిక్ చేసి ఆధార్ లింక్డ్ మొబైల్ ఫోన్‌లో వ‌చ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తే మంచిది. ఆ తరువాత క్లయిమ్ ను సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా సులభంగా పీఎఫ్ సబ్ స్క్రైబర్లు క్లెయిమ్ లను పరిష్కరించుకునే అవకాశాలు ఉంటాయి.