Dating Culture: పాశ్చాత్య దేశాల్లో మొదలైన డేటింగ్ కల్చర్ కొన్నేళ్ల కిందటే ఇండియాకు పాకింది. ధనిక కుటుంబాలు, సినీ, రాజకీయ, స్పోర్ట్స్ తదితర సెలబెట్రీలు డేటింగుల పేరిట చేసే రచ్చ అంతా ఇంతా కాదు. వీళ్లను చూసిన మధ్య తరగతి ప్రజలు సైతం ఇటీవల కాలంలో ఈ కల్చర్ ను బాగానే అలవాటు చేసుకుంటున్నట్లు కన్పిస్తోంది. తాాజాగా ఓ ప్రముఖ ఆన్ లైన్ సంస్థ దేశంలో పెరుగుతున్న డేటింగ్ కల్చర్ పై సర్వే నిర్వహించగా పలు సంచలన విషయాలు బయటికి వచ్చాయి.
కరోనా ఎంట్రీ తర్వాత ప్రతీఒక్కరూ ఆన్ లైన్ వినియోగానికి అలవాటుపడ్డారు. ఈక్రమంలోనే యువతీ యువకులు డేటింగ్ యాప్ ల మాయలో పడుతున్నారు. ఇతరుల ఫ్రొఫైల్ నచ్చిన వెంటనే మాటమంతీ కలుపుతున్నారు. వీరి మధ్య చనువు పెరిగి అంతా అయిపోయాక అవతలి వ్యక్తి నిజస్వరూపం బయటపడుతోంది. డబ్బు రూపంలో లేదా శారీరకంగా బ్లాక్ మెయిల్ వంటి ఘటనలు జరుగుతున్నాయి. దీంతో బాధితులంతా పోలీసులను ఆశ్రయించాల్సి వస్తోంది.
ఇదిలా ఉంటే.. ప్రముఖ ఆన్ లైన్ డేటింగ్ సంస్థ నిర్వహించిన ‘ఇయన్ ఇన్ స్వైప్-2021’ సర్వే ప్రకారంగా.. వీడియో డేటింగులో దేశంలోనే హైదరాబాద్ నెంబర్ వన్ నిలిచిందని తేలింది. ఆ తర్వాతి స్థానాల్లో చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, పుణె వంటి నగరాలు ఉన్నాయని పేర్కొంది. జనవరి 1 నుంచి నవంబర్ 30 మధ్య నిర్వహించిన ఈ సర్వేలో 18 నుంచి 125ఏళ్ల వయస్సు వారి నుంచి సమాచారాన్ని సేకరించినట్లు ఆ సంస్థ చెబుతోంది.
వీటిలో ప్రధానంగా పిక్ నిక్ ఇన్ ఏ పార్క్, వర్చువల్ మూవీ నైట్, సైక్లింగ్ , పొట్టెరీ అంశాలపై యువతీ యువకులు ఆసక్తి కనబరుస్తున్నట్లు పేర్కొంది. అదేవిధంగా వీడియో కాల్ వృద్ధి 52శాతం మేరకు పెరిగినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఇదే సమయంలో డేటింగ్ యాప్ వల్ల 33శాతం క్యాట్ ఫిషింగ్, 38శాతం హనికరమైన లింక్స్, 36శాతం ఫోన్లలో డేటా చోరి జరిగినట్లు కాస్పరస్కీ గ్లోబల్ సర్వే వెల్లడించడం గమనార్హం. అయినప్పటికీ డేటింగ్ యాప్ ల సబ్ స్క్రిష్పన్ రోజురోజుకు గణనీయంగా పెరుగుతుండం విశేషం.
Also Read: Zodiac Signs: 2022 లో ఏ రాశి వారి ప్రేమ జాతకం ఎలా ఉందో తెలుసా?
డేటింగ్ యాప్ లతో మోసాలు జరిగే అవకాశాలు ఉన్నాయని.. అప్రమత్తంగా ఉండాలని సాంకేతిక నిపుణులు, పోలీసులు సూచిస్తున్నారు. డేటింగ్ యాప్ లలో ఫేక్ ప్రొఫల్స్ గుర్తించకుండా మాటమంతీ కలిపితే మోసపోయే ప్రమాదం ఉందంటున్నారు. డేటింగ్ యాప్ సంస్థలు బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ లేకుండా ఇందులోకి అనుమతిస్తుండంతో ఇదొక సోషల్ మీడియాలా మారిందంటున్నారు. యువతీ యువకులు కాలక్షేపానికి దీనికి ఎంచుకున్నా దీర్ఘకాలంలో మాత్రం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందంటున్నారు. ఈ డేటింగ్ యాప్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Also Read: Marriage Vastu Tips: వివాహం ఆలస్యం అవుతుందా అయితే ఈ చిన్న పని చేస్తే చాలు..!