Jayamma Panchayithi: టాలీవుడ్ బుల్లితెరపై స్టార్ యాంకర్ గా నిలిచిన సుమ గురించి అందరికీ తెలిసిందే. తన యాంకరింగ్ తో ఎంతోమందిని ఆకట్టుకొని మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంది. వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది సుమ. ఎన్నో షోలలో యాంకరింగ్ చేసింది.. చేస్తూనే ఉంది. వాస్తవానికి ఆమె కేరళకు చెందిన మహిళే అయినా.. తెలుగు, హిందీ, మలయాళం భాషల్లోనూ అనర్గళంగా మాట్లాడటం ఆమె స్పెషాలిటీ.
యాంకరింగ్ రంగంలో ఆమె స్థానం ఎప్పుడూ సుస్థిరమనే చెప్పాలి. ఫ్యాన్స్ మొదలు స్టార్స్ వరకు ప్రతి ఒక్కరూ ఆమె యాంకరింగ్ కు ఫిదా కావాల్సిందే. ఆమె మాటలు, పరిస్థితులకు అనుగుణంగా వేసే పంచులూ అందరినీ ఆకట్టుకుంటాయి. స్టార్ మహిళ, భలే చాన్సులే వంటి టీవీ ప్రోగ్రామ్స్‌తో మంచి గుర్తింపు సంపాదించుకుంది సుమ.
తాజాగా విజయ్ దర్శకత్వంలో యాంకర్ సుమ ప్రధాన పాత్రలో వస్తోన్న సినిమా జయమ్మ పంచాయితీ.. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రాగా.. తాజాగా మరో అప్డేట్ ప్రకటించింది చిత్రబృందం. ఈ సినిమా టీజర్‌ను హీరో రానా చేతుల మీదుగా విడుదల చేయించారు. ఇందులో సుమ తన యాక్టింగ్‌తో ఇరగదీసింది. పాతకాలపకు సామెతలు చెబుతూ అందర్నీ అలరించింది. దీంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. క ఇందులో పల్లెటూరి మహిళ పాత్రలో సుమ కనిపించనుంది.
