Recover Deleted Contacts: ఒక్కోసారి మన మొబైల్ నుండి అనుకోకుండా ఇంపార్టెంట్ కాంటాక్ట్‌లన్నీ డిలీట్ అయిపోతుంటాయి. సడన్ గా తెలిసిన వాళ్లకు ఫోన్ చేద్దామంటే నెంబర్ ఉండదు. అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. లేదా కొత్త ఫోన్‌కి మారిన తర్వాత పాత నంబర్లు పోతాయి. ఇక నో టెన్షన్.. పోయినవి అనుకన్న కాంటాక్టులు తిరిగి పొందడం ఇప్పుడు చాలా ఈజీ. కొన్ని సాధారణ స్టెప్స్‌ను ఫాలో అవ్వడం ద్వారా మీరు మీ పాత స్నేహితులు, కుటుంబ సభ్యులు , కొలిగ్స్ నంబర్లను ఈజీగా పొందవచ్చు. సైబర్ కేఫ్‌లకు వెళ్లవలసిన అవసరం లేదు.. మీ ఫోన్‌లోనే ఇలా చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులు తమ డిలీట్ అయిన కాంటాక్ట్‌లను ఎలా తిరిగి పొందాలో ఈ కథనంలో తెలుసుకుందాం.
Also Read: ఓలా, ఏథర్‌కు ఇక కష్టాలు మొదలు.. బజాజ్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది!
ఆండ్రాయిడ్ యూజర్ల కోసం సింపుల్ ట్రిక్
* ముందుగా మీ ఫోన్ సెట్టింగ్స్‌కు వెళ్లాలి.
* తర్వాత Google ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి.
* ఇక్కడ మీకు Manage your Google Account కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
* ఇప్పుడు People & sharingలోకి వెళ్లండి.
* తర్వాత Contactsపై క్లిక్ చేయండి.
* ఇప్పుడు Contacts.google.comలో లాగిన్ అవ్వాలి. ఇక్కడ మీకు మీ పాత సింక్ చేయబడిన కాంటాక్ట్‌లన్నీ కనిపిస్తాయి.
* ఒకవేళ పొరపాటున డిలీట్ అయి ఉంటే, Menuలోకి వెళ్లి Undo changes ఆప్షన్‌పై క్లిక్ చేయండి. మీరు 10 రోజులు, 30 రోజులు లేదా కస్టమ్ టైమ్ పరిధిలోని లిస్ట్‌ను కూడా రీ క్రియేట్ చేసుకోవచ్చు.
ఐఫోన్ యూజర్ల కోసం ఐక్లౌడ్ రికవరీ
* మీ ఐఫోన్ సెట్టింగ్స్‌కు వెళ్లాలి
* తర్వాత మీ Apple IDపై క్లిక్ చేయండి.
* iCloud ఆప్షన్‌కు వెళ్లండి.
* Contacts టాగల్‌ను ఆన్ చేయండి. ఇదివరకే సింక్ అయి ఉంటే, మీ కాంటాక్ట్‌లు మళ్లీ ఫోన్‌లో కనిపించడం ప్రారంభిస్తాయి.
* బ్రౌజర్‌లో iCloud.com ఓపెన్ చేయండి.
* మీ Apple IDతో లాగిన్ చేయండి. తర్వాత Account Settings, Advanced, Restore Contactsపై క్లిక్ చేయండి. పాత బ్యాకప్ నుండి మీ కాంటాక్ట్‌లను తిరిగి పొందవచ్చు.
* ఒకవేళ మీరు Super Backup లేదా Truecaller Backup వంటి థర్డ్-పార్టీ బ్యాకప్ యాప్‌లను ఉపయోగిస్తుంటే, వాటి ద్వారా కూడా మీ కాంటాక్ట్‌లను రీ క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది.
ట్రూకాలర్ యాప్:
ట్రూకాలర్ కూడా ఒక థర్డ్-పార్టీ అప్లికేషన్. అయితే దీన్ని ఉపయోగించే ముందు ఒకసారి దాని రివ్యూలు, రేటింగ్‌లను తప్పకుండా చూడండి.
Also Read: ఇన్నోవాకు ఇక కష్టకాలం మొదలు.. కియా క్లావిస్‌తో మార్కెట్ షేక్!