Toyota : పెద్ద ఫ్యామిలీ ఉండి అందరూ కలిసి దూర ప్రయాణాలకు వెళ్లాలంటే అప్పుడు పెద్ద 7 సీట్ల కారు అవసరం అవుతుంది. ఎందుకంటే ప్రయాణంలో అందరూ కలిసి ఉంటే ఆ మజానే వేరు. మీది కూడా పెద్ద ఫ్యామిలీ అయింతే మీరు కొత్త 7 సీట్ల కారు కొనాలని ఆలోచిస్తున్నారా.. అయితే చూడటానికి మారుతి సుజుకి ఎర్టిగా లాగా కనిపించే ఒక ప్రత్యేకమైన కారు గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.. ఇంతకీ ఆ కారు ఏది? దాని ధర ఎంత? మైలేజ్ ఎంత ఇస్తుంది? పూర్తి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
Also Read : ఇన్నోవాకు ఇక కష్టకాలం మొదలు.. కియా క్లావిస్‌తో మార్కెట్ షేక్!
ఎర్టిగాను పోలి ఉండే ఆ కారు టయోటా కంపెనీ రీ బ్యాడ్జ్ వెర్షన్ కు చెందినది. ఈ కారు పేరు టయోటా రూమియన్. పెట్రోల్, సీఎన్‌జీ ఆప్షన్స్‌లో లభించే ఈ ఎంపీవీ (మల్టీ-పర్పస్ వెహికల్) ధర ఎంత?,ఈ కారు పెట్రోల్, సీఎన్‌జీపై ఎంత మైలేజ్ ఇస్తుంది? ఇప్పుడు చూద్దాం.
టయోటా కంపెనీకి చెందిన ఈ 7 సీట్ల కారు ధర రూ.10 లక్షల 54 వేల (ఎక్స్-షోరూమ్) నుండి రూ.13 లక్షల 83 వేల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. రీజెంట్ టయోటా వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఈ కారు సీఎన్‌జీ వేరియంట్ ఒక కిలో సీఎన్‌జీతో హైవేపై 26.1 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. మరోవైపు కార్‌దేఖో నివేదిక ప్రకారం.. టయోటా రూమియన్ పెట్రోల్ వేరియంట్ ఒక లీటర్ పెట్రోల్‌తో 20.11 కిలోమీటర్ల నుండి 20.51 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.
మారుతి సుజుకి ఈ పాపులర్ 7 సీట్ల కారు బేస్ వేరియంట్ ధర రూ.8 లక్షల 96 వేల 500 (ఎక్స్-షోరూమ్). కానీ ఎవరైనా ఈ కారు టాప్ వేరియంట్‌ను కొనుగోలు చేస్తే, వారు రూ.13 లక్షల 25 వేల (ఎక్స్-షోరూమ్) ఖర్చు చేయాల్సి ఉంటుంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం, పెట్రోల్ (మాన్యువల్)పై ఈ కారు 20.51 కిలోమీటర్లు, పెట్రోల్ (ఆటోమేటిక్)పై 20.30 కిలోమీటర్లు, సీఎన్‌జీ (మాన్యువల్)పై 26.11 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది.
Also Read : 47000కార్లను రీకాల్ చేసిన స్కోడా.. లేకపోతే ఎంత ప్రమాదం జరిగేదో ?