ప్రముఖ మెసేజింగ్ యాప్ లలో ఒకటైన వాట్సాప్ వినియోగదారులకు అదిరిపోయే తీపికబురు అందించింది. వ్యూ వన్స్, మల్టీ డివైజ్ సపోర్ట్, ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ లాంటి ఫీచర్లను వాట్సాప్ ప్రస్తుతం పరీక్షిస్తోందని తెలుస్తోంది. ఇతర ఫీచర్లతో పోలిస్తే వాట్సాప్ అందుబాటులోకి తీసుకురనున్న వ్యూ వన్స్ ఫీచర్ నెటిజన్లను ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
వాట్సాప్ అందుబాటులోకి తెచ్చిన ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఇతరులకు పంపే మెసేజ్ లు అవతలి వ్యక్తి చూడగానే డిలీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్ ద్వారా ఫైల్ పంపితే ప్రివ్యూ కూడా కనిపించదు. అవతలి వాళ్లు చాట్ స్క్రీన్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఫైల్ డిలేట్ అవుతుంది. ముఖ్యమైన సమాచారాన్ని, సందేశాలను పంపుకోవాలని భావించే వాళ్లకు ఈ ఫీచర్ ప్రయోజనకరంగా ఉంటుంది.
వ్యూ వన్స్ ఫీచర్ ద్వారా పంపిన మెసేజ్ లను ఇతరులకు ఫార్వర్డ్ చేయడం కూడా సాధ్యం కాదని సమాచారం. ఈ ఫీచర్ ద్వారా పంపిన మెసేజ్ ను అవతలి వ్యక్తి 14 రోజుల్లో చూడకపోతే మెసేజ్ ఆటోమేటిక్ గా డిలేట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. గ్రూప్ చాట్ లలో ఈ ఫీచర్ ను ఎనేబుల్ చేసుకునే అవకాశం ఉంటుంది. వాట్సాప్ యూజర్లకు ఈ ఫీచర్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.
కస్టమర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వాట్సాప్ కొత్త ఫీచర్లను ప్రకటిస్తూ ఉండటం గమనార్హం. ఇప్పటికే కొంతమంది వాట్సాప్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి రాగా మిగిలిన వాళ్లకు కూడా ఈ ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుందని సమాచారం.