పోస్టాఫీస్ సూపర్ పాలసీ.. తక్కువ ప్రీమియంతో ఎక్కువ ఆదాయం..?

పోస్టాఫీస్‌లో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని భావించే వాళ్లకు ప్రయోజనం చేకూరేలా పోస్టాఫీస్ ఒక పాలసీని అందుబాటులోకి తెచ్చింది. జీవితమంతా కవర్ చేసే పోస్ట్ ఆఫీస్ యొక్క బీమా పాలసీ వల్ల ఎక్కువ మొత్తంలో ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఈ పాలసీని తీసుకుంటారో వాళ్లకు ప్రతి సంవత్సరం బోనస్ ను ప్రకటించబడుతుంది. పోస్ట్ ఆఫీస్ గ్రామ సురక్ష పేరుతో ఈ బీమా పాలసీ అమలవుతుండటం గమనార్హం. 1995 సంవత్సరంలో ఈ బీమా పాలసీ మొదలు కాగా […]

Written By: Navya, Updated On : August 4, 2021 9:24 pm
Follow us on

పోస్టాఫీస్‌లో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని భావించే వాళ్లకు ప్రయోజనం చేకూరేలా పోస్టాఫీస్ ఒక పాలసీని అందుబాటులోకి తెచ్చింది. జీవితమంతా కవర్ చేసే పోస్ట్ ఆఫీస్ యొక్క బీమా పాలసీ వల్ల ఎక్కువ మొత్తంలో ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఈ పాలసీని తీసుకుంటారో వాళ్లకు ప్రతి సంవత్సరం బోనస్ ను ప్రకటించబడుతుంది. పోస్ట్ ఆఫీస్ గ్రామ సురక్ష పేరుతో ఈ బీమా పాలసీ అమలవుతుండటం గమనార్హం.

1995 సంవత్సరంలో ఈ బీమా పాలసీ మొదలు కాగా ఈ బీమా పాలసీని తీసుకోవడానికి కనీస ప్రవేశ వయస్సు 19 సంవత్సరాలుగా గరిష్ట ప్రవేశ వయస్సు 55 సంవత్సరాలుగా ఉంది. కనీస హామీ మొత్తం 10,000 రూపాయలు కాగా గరిష్ట హామీ మొత్తం 10 లక్షల రూపాయలుగా ఉంది. లక్ష రూపాయల బీమా మొత్తానికి ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు బోనస్ గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది.

బీమా చేసిన వ్యక్తి మరణించినప్పుడు నామినీకి మెచ్యూరిటీ ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. లేదా 80 సంవత్సరాల జీవితకాలం పూర్తైన తర్వాత పాలసీ తీసుకున్న వ్యక్తి మెచ్యూరిటీ బెనిఫిట్స్ పొందుతారు. ఈ పాలసీ కింద మెచ్యూరిటీ వయోపరిమితి 50, 55, 58 మరియు 60 సంవత్సరాలుగా ఉండటం గమనార్హం. 19 సంవత్సరాల వయస్సులో 5 లక్షల బీమా తీసుకుంటే మెచ్యూరిటీ వయస్సు 60 సంవత్సరాలు కాగా ప్రతి నెలా 705 రూపాయలు చెల్లించాలి.

60 సంవత్సరాలకు ఏకంగా 17.30 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. 5 లక్షల బీమా మొత్తంలో వార్షిక బోనస్ 30 వేల రూపాయలుగా ఉంటుంది. 41 సంవత్సరాలలో ప్రీమియంగా 3.46 లక్షల రూపాయలు చెల్లించాలి.