గూగుల్ పే ద్వారా ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో ఏడాది పాటు డబ్బులను డిపాజిట్ చేసుకోవచ్చు. గరిష్టంగా 6.35 శాతం వడ్డీరేటును పొందే అవకాశం అయితే ఉంటుంది. ఆధార్‌తో గూగుల్ పే సర్వీసుకు కేవైసీ చేయించుకుంటే ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది. వన్ టైమ్ పాస్‌వర్డ్ సహాయంతో ఈ ఫెసిలిటీని వినియోగించుకోవచ్చు. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో సేవింగ్స్ అకౌంట్ లేకపోయినా ఫిక్స్‌డ్ డిపాజిట్ సులువుగా చేయవచ్చు.
మన ఖాతాలో ఉన్న డబ్బులు ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కు మూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. విత్ డ్రా చేసుకున్న డబ్బులు మాత్రం మన ఖాతాల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. విత్ డ్రా చేసుకున్న తర్వాత ఖాతాలో తిరిగి నగదు జమవుతాయి. ఉజ్వన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లలో కూడా ఫిక్స్ డ్ డిపాజిట్ ఫీచర్ ను వినియోగించుకునే అవకాశం ఉంటుంది.
ఫిక్స్‌డ్ డిపాజిట్ సమయంను బట్టి వడ్డీరేటు అమలవుతోంది. 150 మంది మంత్లీ యాక్టివ్ యూజర్లకు ఈ సర్వీస్ ను పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం గూగుల్ పే బీటా వెర్షన్ లో ఈ సదుపాయం అందుబాటులో ఉందని తెలుస్తోంది.