చి.ల.సౌ సినిమా హిట్ తర్వాత అలా వైకుంఠపురంలో సినిమాతో ప్రేక్షకులను అలరించి సుశాంత్ హాట్రిక్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇచ్చట వాహనాలు నిలుపరాదు సినిమా ఈరోజు విడుదల కానుంది. ప్రియురాలి ఇంటికి వెళ్లిన ప్రియుడు ఏ విధంగా కష్టాల్లో చిక్కుకుంటానేది ఈ చిత్రంలో చూపిస్తున్నట్లు అర్థమవుతుంది. రోమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం వస్తోంది. ఎస్. దర్శన్ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాలో సుశాంత్ కు జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఏ1 స్టూడియోస్ మరియు శాస్త్ర మూవీస్ బ్యానర్లపై రవిశంకర్ శాస్ట్రీ-ఏక్లా శాస్త్రి, హరీష్ కోయలగుండ్ల ఈ చిత్రాన్ని నిర్మించారు.