Elon Musk SpaceX AX-4 Mission: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన అంతరిక్ష వాహక నౌక ద్వారా స్పేస్ ఎక్స్ ద్వారా విభిన్న దేశాలకు చెందిన ఆస్ట్రోనాట్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు చేరుకున్నారు. ఈ ఆస్ట్రోనాట్స్ ను స్పేస్ ఎక్స్ ” యాక్స్ -4″ మిషన్ ను అంతరిక్షంలోకి పంపించింది.. నాసాలోని కెనడీ స్పేస్ సెంటర్లోని లాంచ్ కాంప్లెక్స్ 39a నుంచి స్పేస్ కంపెనీకి చెందిన ఫాల్కన్ -9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.. వివిధ దేశాలకు చెందిన వ్యోమగాములు ఈ అంతరిక్ష నౌక కు గ్రేస్ అని పేరు పెట్టారు. అంతరిక్షంలోకి చేరుకున్న తర్వాత.. కక్ష్య లో ప్రవేశించిన అనంతరం విభిన్న దేశాలకు చెందిన ఆస్ట్రోనాట్స్ ఈ విషయాన్ని వెల్లడించారు. వాహక నౌక అంతరిక్ష కేంద్రంలోకి చేరుకున్న తర్వాత.. ఆ వీడియోను “స్పేస్ ఎక్స్” తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పంచుకుంది. ఈ వీడియో చూస్తుంటే విఠలాచార్య సినిమా గుర్తుకు వచ్చింది. అద్భుతం అనే మాట చిన్నబోయేలా ఈ వీడియో ఉంది.
#Ax4 have entered the @Space_Station. pic.twitter.com/PyDQfE4OHf
— Axiom Space (@Axiom_Space) June 26, 2025
జూన్ 11న చేయాల్సి ఉన్నప్పటికీ..
ఈ ప్రయోగాన్ని జూన్ 11న చేయాల్సి ఉన్నప్పటికీ.. అనివార్య కారణాల వల్ల రెండు వారాలపాటు వాయిదా వేశారు. అధిక ఎత్తులో గాలులు వీయడం వల్ల ఈ ప్రయోగాన్ని నిలుపుదల చేశారు. మరోవైపు ప్రయోగ వాహనంలో హీలియం లీక్ కూడా ఆలస్యానికి కారణంగా మారింది. చివరికి జూన్ 23న ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ఇక ఈ ప్రయోగాన్ని నాసా మాజీ ఆస్ట్రోనాట్ పెగ్గి విట్సన్ పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆమె యాక్స్ -4 ప్రయోగానికి సంబంధించి డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ఈమెతోపాటు పైలట్ శుభాన్ష్ శుక్లా, మిషన్ నిపుణులు స్వావోస్జ్ ఉజ్నాన్స్కీ, విస్నివ్స్కీ, టి బోర్ కూడా ఈ మిషన్ లో ఉన్నారు.. వీరంతా కూడా భారత్, పోలాండ్, హంగేరి దేశాల చెందినవారు. విభిన్న దేశాల నుంచి ఒక ప్రయోగాన్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేర్చిన తొలి వ్యోమగాములు వీరే. యాక్స్-4 అనేది విట్సన్ కు చెందిన ఐదవ కక్షా ప్రయోగం. ఈ ప్రయోగం ద్వారా ఆమె అంతరిక్షంలో దాదాపు 700 రోజులపాటు గడిపిన మహిళా వ్యోమగామిగా చరిత్ర సృష్టిస్తారు.. యాక్స్-4 ప్రయోగం ద్వారా ఆమె రెండు వారాలపాటు అక్కడే ఉంటారు. ఇక వ్యోమగాములు 60 కి పైగా ప్రయోగాలు చేస్తారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ వంటి విభాగాలలో ప్రయోగాలు నిర్వహిస్తారు. ఇప్పటివరకు అంతరిక్ష కేంద్రంలోకి వివిధ దేశాలు అనేక ప్రయోగాలు చేశాయి. ఎప్పుడూ నలుగురు ఆస్ట్రోనాట్స్ ను పంపించలేదు. ఒక రకంగా స్పేస్ ఎక్స్ వాహక నౌక ద్వారా నలుగురు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపడం బహుశా ఇదే తొలిసారి.
At 2:31am ET on Wednesday, the Ax-4 crew from @Axiom_Space lifted off on the @SpaceX Dragon spacecraft from @NASAKennedy in Florida to the orbital outpost. More… https://t.co/EFme19Ql6c pic.twitter.com/cpnPehrkyG
— International Space Station (@Space_Station) June 25, 2025