వాట్సాప్ లో ఈ షార్ట్ కట్స్ గురించి మీకు తెలుసా?

స్మార్ట్ ఫోన్లలో ఎక్కువగా ఉపయోగించే అప్లికేషన్లలో వాట్సాప్ ఒకటనే సంగతి తెలిసిందే. ఉద్యోగాలు చేసేవాళ్లలోఎక్కువమంది వెబ్ వాట్సాప్ ను వినియోగిస్తున్నారు. కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ద్వారా విధులు నిర్వర్తించే అవకాశం కల్పించడంతో ల్యాప్ టాప్, డెస్క్ టాప్ లలో వెబ్ వాట్సాప్ ను వాడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వెబ్ వాట్సాప్ ను తరచూ వినియోగించే వాళ్లు కొన్ని షార్ట్ కట్ లను వినియోగించడం ద్వారా సమయం ఆదా చేసుకోవచ్చు. వెబ్ వాట్సాప్ […]

Written By: Kusuma Aggunna, Updated On : July 25, 2021 9:06 pm
Follow us on


స్మార్ట్ ఫోన్లలో ఎక్కువగా ఉపయోగించే అప్లికేషన్లలో వాట్సాప్ ఒకటనే సంగతి తెలిసిందే. ఉద్యోగాలు చేసేవాళ్లలోఎక్కువమంది వెబ్ వాట్సాప్ ను వినియోగిస్తున్నారు. కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ద్వారా విధులు నిర్వర్తించే అవకాశం కల్పించడంతో ల్యాప్ టాప్, డెస్క్ టాప్ లలో వెబ్ వాట్సాప్ ను వాడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వెబ్ వాట్సాప్ ను తరచూ వినియోగించే వాళ్లు కొన్ని షార్ట్ కట్ లను వినియోగించడం ద్వారా సమయం ఆదా చేసుకోవచ్చు.

వెబ్ వాట్సాప్ లో ప్రొఫైల్ అండ్ ఎబౌట్ సెక్షన్ కు వెళ్లడానికి ctrl+alt+p ను క్లిక్ చేయాలి. ఏదైనా గ్రూప్ నుంచి ఎగ్జిట్ కావాలని అనుకుంటే త్రీ డాట్స్ ను క్లిక్ చేయడానికి బదులుగా ctrl+alt+backspace ను ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా గ్రూప్ నుంచి వచ్చే నోటిఫికేషన్లను మ్యూట్ చేయాలని అనుకుంటే ctrl+alt+shift+m ప్రెస్ చేస్తే సరిపోతుంది. వాట్సాప్ యాప్ లోని సెట్టింగ్స్ కు వెళ్లాలనుకుంటే ctrl+alt+ క్లిక్ చేస్తే సరిపోతుంది.

ఎంచుకున్న వాయిస్ మెసేజ్ స్పీడ్ ను పెంచుకోవాలనుకున్నా తగ్గించుకోవాలనుకున్నా shift+ షార్ట్ కట్ ను వినియోగించుకోవచ్చు. కొత్తగా గ్రూప్ ను క్రియేట్ చేసుకోవాలని అనుకుంటే ctrl+alt+shift+n ను క్లిక్ చేయాలి. న్యూ చాట్ ను ఓపెన్ చేయాలని అనుకుంటే ctrl+alt+n ను ప్రెస్ చేయాల్సి ఉంటుంది. గ్రూప్ లోని చాటింగ్ సెక్షన్ లో సెర్చ్ ఆప్షన్ ను ఎంచుకోవాలంటే ctrl+alt+shift+f క్లిక్ చేస్తే సరిపోతుంది.

పిన్ చాట్ ద్వారా ముఖ్యమైన గ్రూప్ ను టాప్ లో పెట్టుకోవడంతో పాటు ctrl+alt+shift+p ప్రెస్ చేయాలి. ఏదైనా గ్రూప్ లేదా వ్యక్తిగత చాటింగ్ ను అర్కివ్ చేసుకోవాలని అనుకుంటే ctrl+alt+e క్లిక్ చేస్తే సరిపోతుంది. ఏదైనా మెసేజ్ ను అన్ రీడ్ మోడ్ లో ఉంచాలని అనుకుంటే ctrl+alt+shift+u ను క్లిక్ చేయాల్సి ఉంటుంది.