https://oktelugu.com/

పోస్టాఫీస్ ద్వారా పాస్ పోర్ట్ ను పొందే అవకాశం.. ఎలా అంటే..?

మన దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్లాలంటే పాస్ పోర్ట్ కచ్చితంగా ఉండాలనే సంగతి తెలిసిందే. పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవడం ద్వారా పాస్ పోర్ట్ ను పొందే అవకాశం ఉంటుంది. పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలను విదేశాంగ శాఖ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇకపై సమీపంలోని పోస్టాఫీసుల ద్వారా కూడా పాస్ పోర్ట్ ను పొందవచ్చు. ఇండియా పోస్ట్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాలను వెల్లడించింది. ఆన్ లైన్ లో పాస్ పోర్ట్ కోసం […]

Written By: , Updated On : July 25, 2021 / 09:28 PM IST
Follow us on

మన దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్లాలంటే పాస్ పోర్ట్ కచ్చితంగా ఉండాలనే సంగతి తెలిసిందే. పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవడం ద్వారా పాస్ పోర్ట్ ను పొందే అవకాశం ఉంటుంది. పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలను విదేశాంగ శాఖ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇకపై సమీపంలోని పోస్టాఫీసుల ద్వారా కూడా పాస్ పోర్ట్ ను పొందవచ్చు. ఇండియా పోస్ట్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాలను వెల్లడించింది.

ఆన్ లైన్ లో పాస్ పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అందుకోసం పోస్ట్ ఆఫీస్ అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ ఫీజును చెల్లించి ఫారం సమర్పించి వచ్చిన తేదీని బట్టి ఎంచుకున్న పత్రాలతో పోస్టాఫీస్ కు వెళ్లాల్సి ఉంటుంది. పాస్ పోర్ట్ ను పొందాలని అనుకునేవాళ్లు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ తో పాటు పాన్ కార్డ్, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు, హైస్కూల్ మార్క్ షీట్, ఎలక్షన్ కార్డ్ ను సమర్పించాల్సి ఉంటుంది.

పోస్టాఫీస్ కు అన్ని పత్రాలను తీసుకెళ్లిన ఆ పత్రాలను పరిశీలించి అన్నీ సరిగ్గా ఉంటే మాత్రమే ప్రామాణికతను తనిఖీ చేయడం జరుగుతుంది. పోస్టాఫీస్ కు వెళ్లిన సమయంలో రెటీనా స్కానింగ్ తో పాటు వేలిముద్రలను ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధానం ద్వారా 15 రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి కావడంతో పాటు తరువాత సులభంగా పాస్ పోర్ట్ ను పొందే అవకాశం అయితే ఉంటుందిhttp://

 

ఈ విధానం ద్వారా కొత్తగా పాస్ పోర్ట్ ను తీసుకోవాలని భావించే వాళ్లకు ప్రయోజనం చేకూరనుంది. ఏవైనా సందేహాలు ఉంటే సమీపంలోని పోస్టాఫీస్ ను సందర్శించడం ద్వారా ఆ సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది.