Brian Johnson: మనిషి జీవితంలో బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అనే మూడు దశలుంటాయి. ఇందులో బాల్యం, యవ్వన దశలో చర్మం తాజాగా ఉంటుంది. మనసు చురుకుగా ఉంటుంది. వయసు ఉరకలెత్తుతుంది.. ఏ పనైనా చేయాలనే కోరిక ఉంటుంది. వృద్ధాప్యంలో ఇవన్నీ సాధ్యం కావు. పైగా శరీరం అనేక మార్పులకు గురవుతుంది. అయితే కొంతమంది వృద్ధాప్యంలో కూడా శరీరం బాగుండాలని.. చర్మం కాంతివంతంగా ఉండాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వ్యాయామం, ఆహారపు అలవాట్లు మార్చుకోవడం వల్ల జీవిత కాలాన్ని సాగదీస్తుంటారు. అయితే పెరిగే వయసుకు బ్రేక్ వేయడం సాధ్యమయ్యే ప్రయోగాలు జరిగినప్పటికీ.. అవి ఒక దశలో ఆగిపోయాయి. హాలీవుడ్ సినిమాలు, కాల్పానిక సాహిత్యంలో తప్ప వయసుకు బ్రేక్ వేసిన ఉదంతాలు నిజజీవితంలో చోటు చేసుకోలేదు. అయితే ఇకపై అవి కళ్ళ ముందు ఆవిష్కారం కాబోతున్నాయి.
వయసు పెరుగుదలను అడ్డుకోవచ్చు
పురాణ కాలంలో అమృతం తాగితే చిరంజీవి గా ఉంటారని మనం చదువుకున్నాం.. ప్రస్తుత కాలంలో మనిషి మరణాన్ని నిలువరించలేకపోయినప్పటికీ.. వయసు పెరుగుదలను అడ్డుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అది త్వరలోనే సాధ్యమవుతుందని చెబుతున్నారు. అమెరికా దేశాని చెందిన బ్రయాన్ జాన్సన్ అనే వ్యాపారవేత్త తన వయసును తగ్గించుకోవడం కోసం ప్రతి సంవత్సరం 16 కోట్ల దాకా ఖర్చు పెడుతున్నారు.. దీర్ఘాయుష్షు కోసం శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేస్తున్నారు. అయితే ఇందులో “రాపామైసిన్” ముఖ్యపాత్ర పోషిస్తున్నట్టు వారు గుర్తించారు. జాన్సన్ కూడా దీన్నే ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. దీనికి మనిషి జీవితాన్ని పొడిగించే శక్తి ఉన్నట్టు శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. దీనిని వైద్య పరిభాషలో మ్యాజిక్ పిల్..(మంత్ర శక్తి గల మాత్ర) అని పిలుస్తున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ పేజింగ్ అనే సంస్థ 2009లో ఇంటర్వెన్షన్స్ టెస్టింగ్ ప్రోగ్రాం ను ఎరుకలపై చేసింది. వాటికి రాపా మైసిన్ ఇచ్చింది. తద్వారా ఎలుకల జీవితకాలం 25% పెరిగినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. తర్వాత బ్రయాన్ కోసం ఆయన వ్యక్తిగత వైద్యులు కూడా రాపా మైసిన్ ఇచ్చారు..
ఇది ఎలా పనిచేస్తుందంటే
రాపా మైసిన్ యాంటి ఏజింగ్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది. అయితే దీనిపై ఇటీవల కాలంలో శోధన పెరిగిపోయింది. రాపా మైసిన్ అనేది యాంటీ క్యాన్సర్ చికిత్సలో ఉపయోగిస్తారు. ఒక రకంగా దీనిని ఇమ్యునో సప్రజెంట్స్ లాగా పాడుతుంటారు. రాఫా మైసిన్ ను బ్యాక్టీరియా నుంచి తయారుచేస్తారు. ఐస్ లాండ్, చిలీ ప్రాంతాలలో లభ్యమయ్యే బ్యాక్టీరియా గురించి దీనిని తయారు చేస్తారు.. మన శరీరంలో mTOR అనే ప్రోటీన్.. శరీరంలో కణజాలాల ఎదుగుదలకు తోడ్పడుతుంది. అందులో కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. mTOR ప్రోటీన్ పనితీరును రాపామైసిన్ ప్రభావితం చేస్తుంది. ఫలితంగా కనాల పెరుగుదల ఆగిపోతుంది. దీంతో మనిషి వయసు పెరిగినప్పటికీ.. తదుపరి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉండదు.