Artificial Intelligence: కాలం మారుతున్న కొద్దీ సాంకేతికం విస్తరిస్తోంది. గత పదేళ్ల నుంచి ప్రపంచం దాదాపుగా డిజిటల్ మయం అవుతోంది. దీనికి కారణం మొబైల్ విప్లవం అని చెప్పవచ్చు. మొబైల్ అందుబాటులోకి వచ్చిన తరువాత కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. అయితే ఇటీవల బాగా వినిపిస్తున్న పేరు AI(Arfificial Intelligence). ఏదైనా సమస్య వచ్చినా? సందేహాలు ఉన్నా..? వాటి పరిష్కారానికి ఏఐ త్వరగా పరిష్కారం చూపుతోంది. దీంతో చాలా మంది ఏఐని ఉపయోగించి తమ పనులను సులభతరం చేసుకుంటున్నారు. మొన్నటి వరకు కేవలం ల్యాప్ ట్యాప్, డెస్క్ టాప్ లల్లో మాత్రమే అందుబాటులో ఉండే ఏఐ.. ఇప్పుడు మొబైల్ లో ఉపయోగించే విధంగా మారిపోయింది. దీంతో ఏఐ మయం అయిపోయిందని అనుకోవచ్చు. అయితే మొబైల్ లోని ఓ యాప్ ద్వారా ఏఐ ఆధారిత పనులు ఈజీగా చేసుకోవచ్చు. అ యాప్ ఏదో తెలుసుకుందాం..
ఒకప్పుడు ఏదైనా సమస్య పరిష్కారం కోసం గూగుల్ ను సంప్రదించేవాళ్లు. అదీ సాధ్యంకాకపోతే నిపుణులను సంప్రదించేవాళ్లు. కానీ ఏ పనుల కోసమైనా వివిధ రకాల అప్లికేషన్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఉపయోగించి కొన్ని సాధ్యం కాని పనులు కూడా పూర్తి చేస్తున్నారు. ఈమధ్య ఏఐ ఆధారిత యాప్ లు విపరీతంగా డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అయితే ఒక్కో రంగానికి ఏఐ ఒక్కో విధంగా ఉంటుంది. కానీ అన్ని రకాల అవసరాలు తీర్చే ఏఐ ఒకే యాప్ లో ఉంటే చాలా ఈజీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఓ యాప్ ఈ అసవరాలను తీరుస్తూ అలరిస్తోంది.
మొబైల్ లోని ప్లే స్టోర్ కు వెళ్లి Bubbole Keyboard అని టైప్ చేయగా.. ఓ యాప్ వస్తుంది. దీనిని డౌన్లోడ్ చేసుకొని ఇన్ స్టాల్ చేసుకోవాలి. ఈ యాప్ ద్వారా ఎటువంటి మెసేజ్ చేసినా దానికి సంబంధించిన ఏఐ స్టైల్ లో ఉంటుంది. అలాగే ఏదైనా సందేహం ఉన్నా.. ఇందులో కొశ్చెన్ చేయగా.. ఏఐ వెంటనే సమాధానం ఇస్తుంది. ఇక ఇప్పటికే ఏఐ ఆధారిత డిజిటల్ ఇమేజ్ లు అలరిస్తున్నాయి. ఇందులో కూడా కావాల్సిన పిక్ఛర్ కోసం మెసేజ్ చేయడం వల్ల అందమైన ఫొటోలను ఇది పంపిస్తుంది.
కొన్ని పుస్తకాలు చదవాలని కోరిక ఉంటుంది. అలాగే ఒక విషయం అర్థం చేసుకోవడానికి పెద్ద స్టోరీ స్టడీ చేయాల్సి ఉంటుంది. కానీ ఏదైనా సమాచారం పూర్తిగా తెలుసుకోవాలంటే పూర్తిగా చదవకుండా దానికి సంబంధించిన లింక్ లేదా మ్యాటర్ ను ఇందులో పేస్ట్ చేయాలి. దీంతో ఆ విషయం ఏంటో సింపుల్ గా తెలియజేస్తుంది. ఇవే కాకుండా మూవీస్, ఇతర ఎలాంటి సమాచారం కావాలన్నా దీని ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ఈ యాప్ డౌన్లోడ్ చేసిన తరువా అలో పర్మిషన్ చేయాల్సి ఉంటుంది.
ప్రస్తుతం ఏఐ దాదాపు అన్ని రంగాల్లో విస్తరించుకుపోతుంది. ముఖ్యంగా భవిష్యత్ లో ఉద్యోగాలు సైతం ఏఐ నాలెడ్జ్ బేస్ పైనే ఉండే అవకాశం ఉంది.ఈ నేపథ్యంలో ఏఐ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇలాంటి యాప్ ల ద్వారా తెలుసుకొన్నా.. దీనిపై అవగాహన పెంచుకోవచ్చు. ఇవే కాకుండా చాలా యాప్స్ అందుబబాటులోకి వస్తున్నాయి. కానీ అన్ని రకాల సేవలు పొందాలనుకునేవారు ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చని కొందరు సాంకేతిక నిపుణులు తెలుపుతున్నారు.