https://oktelugu.com/

Viswam Movie Trailer: విశ్వం సినిమా ట్రైలర్ ఓకే.. కానీ సినిమా పరిస్థితి ఏంటి..?

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా, దర్శకుడిగా ముందుకు సాగాలంటే మాత్రం ఎప్పటికప్పుడు వాళ్ళను వాళ్లు ప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే మాత్రం అవుట్ డేటెడ్ అయిపోయారంటూ సినిమా ఇండస్ట్రీ మొత్తం వారిని తీసి పక్కన పెట్టేస్తుంది. కాబట్టి ఇక్కడ సక్సెస్ మాత్రమే చాలా కీలక పాత్ర వహిస్తుంది...

Written By:
  • Gopi
  • , Updated On : October 6, 2024 / 01:44 PM IST

    Viswam Collection

    Follow us on

    Viswam Movie Trailer: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు వరుస బ్లాక్ బాస్టర్ సక్సెస్ లను అందుకున్న దర్శకుడు శ్రీను వైట్ల… అయితే గత కొద్ది సంవత్సరాల నుంచి ఆయనకు వరుసగా డిజాస్టర్లు రావడంతో ఆయనకు సినిమా ఇచ్చే హీరో కరువయ్యారు. ఇక మొత్తానికైతే గోపీచంద్ సాహసం చేసి మరి అతనికి సినిమా చేసే అవకాశాన్ని ఇచ్చాడు. ఇక వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న విశ్వం సినిమా ఈనెల 11వ తేదీన ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఇక దసరా కానుక వస్తున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి అంచనాలైతే ఉన్నాయి. మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుందా? లేదా అనే విషయాల మీద కూడా సరైన క్లారిటీ రావాల్సి ఉంది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో శ్రీను వైట్ల మంచి సక్సెస్ ని సాధించాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా నుంచి కొద్దిసేపటికి క్రితమే ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ఇక యాక్షన్ ఎపిసోడ్స్ ను , కామెడీ సీన్స్ ని కూడా బాగా ఎలివేట్ చేసే విధంగా ట్రైలర్ కట్ అయితే ఇచ్చారు. మరి ఈ సినిమా మొత్తం ఇదేవిధంగా ఎంటర్ టైనింగ్ గా సాగితే మాత్రం ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ అవుతుందని చాలామంది సినీ అభిమానులు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

    మరి మొత్తానికైతే గోపీచంద్ శ్రీనువైట్ల కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితేనే వీళ్ళ కాంబినేషన్ కి మంచి గుర్తింపు అయితే వస్తుంది. లేకపోతే మాత్రం వీళ్ళిద్దరి కెరియర్ కి భారీగా డామేజ్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ట్రైలర్ ని చాలా అద్భుతంగా కట్ చేసిన దర్శకుడు ఈ సినిమాను కూడా అదే విధంగా తెరకెక్కిచుంటే మాత్రం శ్రీను వైట్ల మరోసారి బౌన్స్ బ్యాక్ అవుతాడనే చెప్పాలి.

    అయితే ఈ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ చాలా ఎక్స్ట్రాడినరీగా పేలుతోందని శ్రీనువైట్ల మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇక వెన్నెల కిషోర్ కూడా ఈ సినిమాలో తనదైన రీతిలో కామెడీని పంచినట్టుగా మనకు ట్రైలర్ ని చూస్తే ఈజీగా అర్థమవుతుంది… ఇక మొత్తానికైతే ఈ సినిమాతో శ్రీను వైట్ల గోపీచంద్ భారీ కంబ్యాక్ ఇవ్వబోతున్నారనేది మాత్రం చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది.

    మరి ఈనెల 11వ తేదీన పెద్దగా పోటీ ఏమీ లేదు కాబట్టి ఈ సినిమా వచ్చి పండుగను క్యాష్ చేసుకొనే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవడం అనేది చాలా మంచి విషయం అనే చెప్పాలి. మరి గోపీచంద్ ఈ పండుగకు హీరో అవుతాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం 11వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే…