Papaya: ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో బొప్పాయి కూడా ఒకటి. సాధారణంగా ఈ పండును ప్రతి ఒక్కరూ వాళ్ల డైలీ లైఫ్‌లో చేర్చుకుంటారు. తినడానికి తియ్యగా ఉండే బొప్పాయిలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే పపైన్ అనే ఎంజైమ్ జీర్ణ ప్రకియను వేగవంతం చేయడంలో బాగా ఉపయోగపడుతుంది. ప్లేట్‌లెట్స్ సంఖ్య తక్కువగా ఉన్నవారు ఈ పండ్లను లేదా ఆకుల జ్యూస్ తాగితే మంచి ఫలితం ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా ఈ పండును తింటే ఆరోగ్యంగా ఉంటారు. అయితే గర్భిణులు మాత్రం ఈ పండును తినకూడదని వైద్య నిపుణులు చెబుుతుంటారు. అయితే చాలామంది ఈ పండును ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా తింటుంటారు. ఇలా పరగుడుపున ఈ పండును తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయా? అని సందేహ పడుతున్నారు. ఇందులో కెరోటినాయిడ్స్, మోనోటెర్ఫెనాయిడ్స్, ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, విటమిన్లు, మినరల్స్, సూక్ష్మపోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరానికి మేలు చేయడమే. కానీ హాని చేయవని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి పరగడుపున బొప్పాయి పండును తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తినడం వల్ల బాడీ డిటాక్స్ అవుతుంది. శరీరంలో ఉండే టాక్సిన్లను బయటకు పంపడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. గుండె సమస్యలు, జీర్ణ సమస్యలు రాకుండా ఉండటాన్ని కాపాడుతుంది. కొందరు మలబద్దకం సమస్యతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు ఉదయాన్నే బొప్పాయిని తినడం వల్ల విముక్తి పొందుతారు. కొందరు గ్యాస్ట్రిక్ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వారు డైలీ బొప్పాయి పండు తింటే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల బరువు నియంత్రణలో ఉండటంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరగకుండా అదుపులో ఉంటాయి. బొప్పాయిలో మైరిసెటిన్, విటమిన్ సితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా ఉపయోగపడతాయి. అలాగే శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే శక్తిని కూడా ఇస్తుంది.
ఖాళీ కడుపుతో బొప్పాయి పండు తినడం వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. ఎక్కువగా నీరసం, అలసట సమస్య ఉన్నవారు ఈ పండును ఉదయాన్నే తినడం మేలు. బొప్పాయితో చర్మ ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. దీనిని తినడంతో పాటు ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకున్న చర్మం కాంతివంతంగా మెరిసిపోతుంది. తొందరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా యంగ్‌గా ఉండేందుకు సాయపడుతుంది. రోజులో ఉదయం పూట పరగడుపున తింటేనే ఈ ప్రయోజనాలు దక్కుతాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవన్నీ శరీరానికి ప్రయోజనాలను మాత్రమే చేకూరుస్తుంది. ఎలాంటి డౌట్ లేకుండా డైట్‌లో ఈ పండును యాడ్ చేసుకోవచ్చు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు గూగుల్ ఆధారంగా చెప్పడం జరిగింది. ఇవి పాటించే ముందు పండితుల సూచనలు తెలుసుకోవడం ఉత్తమం.