Zaheer Khan : గౌతమ్ గంభీర్ పదవి కాలం ముగియడానికి ఇంకా చాలా సమయమే ఉంది. గౌతమ్ గంభీర్ కోచింగ్ సారధ్యంలోనే టీమ్ ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. ఇది ఒక రకంగా అతడి పదవిని మరింత పటిష్టం చేసింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఓడిపోయిన తర్వాత.. అంతకుముందు న్యూజిలాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ కోల్పోయిన తర్వాత గౌతమ్ గంభీర్ ను టెస్ట్ ఫార్మాట్ నుంచి తొలగిస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు.. టెస్ట్ ఫార్మాట్ లోనూ గౌతమ్ గంభీర్ ను కొనసాగించాలని బీసీసీఐ పెద్దలు నిర్ణయించారు. అయితే టెస్ట్ ఫార్మాట్ లో టీమిండియా విఫలమవుతున్న నేపథ్యంలో తెరపైకి కఠిన నిబంధనలను తీసుకొచ్చారు. వాటిని ఛాంపియన్స్ ట్రోఫీలో అమలు చేయడం మొదలుపెట్టారు. తద్వారా ఒక ఓటమి కూడా ఎదురు కాకుండా టీమ్ ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీలో విజయం సాధించి.. ఛాంపియన్ గా ఆవిర్భవించింది. దీని ప్రకారం భవిష్యత్తు కాలంలోనూ అవే నిబంధనలు అమలు చేసే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ ముగిసిన తర్వాత టీమిండియా వరుసగా సిరీస్ లు ఆడుతుంది. ఇందులో టి20 వరల్డ్ కప్ కూడా ఉంది. గత టి20 వరల్డ్ కప్ లో టీమిండియా కు రోహిత్ శర్మ సారధ్యం వహించాడు. ఈసారి సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహించే అవకాశాలున్నాయి. మొత్తంగా కోచ్ పదవి నుంచి గంభీర్ కు ప్రత్యామ్నాయంగా మరొక వ్యక్తిని నియమించే అవకాశం లేదు.
Also Read : ఆ స్టార్లతో మళ్లీ ఆడాలని ఉంది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మిస్టర్ కూల్!
జహీర్ ఖాన్ ఏమన్నాడు అంటే
టీమిండియాలో ఒకప్పుడు అద్భుతమైన బౌలర్ గా కీర్తి ప్రతిష్టలు సంపాదించాడు జహీర్ ఖాన్ (Zaheer Khan). అద్భుతమైన వేగంతో.. అనితర సాధ్యమైన టెక్నిక్ తో బంతులు విసిరేవాడు.. ఒక దశాబ్దం పాటు టీమ్ ఇండియాలో బౌలింగ్ దళానికి వెన్నెముకలాగా జహీర్ ఖాన్ నిలిచాడు. తన బౌలింగ్ నైపుణ్యంతో వికెట్ల వేటను కొనసాగించాడు. ఇక జహీర్ ఖాన్ టెస్టులలో 311, వన్డేలలో 282 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ టి20 మ్యాచ్లలో 17 వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఇక ఐపీఎల్ లో వంద వికెట్లు దక్కించుకున్నాడు. జహీర్ ఖాన్ ప్రస్తుతం ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow super giants) జట్టుకు మెంటార్ గా కొనసాగుతున్నాడు. అయితే ఓ ప్రైవేట్ స్పోర్ట్స్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర సంగతులు పంచుకున్నాడు.. తన కెరియర్ సాగిన విధానం.. ప్రస్తుతం కెరియర్ సాగుతున్న విధానాన్ని వెల్లడించిన అతడు.. టీమ్ ఇండియా కోచ్ పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.. ” భారత జట్టుకు ప్రధాన బౌలర్ గా ఒకప్పుడు నేను కొనసాగాను. ఆ రోజుల్లో కూడా పోటీ తీవ్రంగా ఉండేది. ఆటగాళ్లపై ఒత్తిడి ఉండేది. వాటన్నింటినీ నేను ఆస్వాదించాను. టీమ్ ఇండియా తరఫున గొప్ప బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాను. ఒకవేళ భవిష్యత్తు కాలంలో టీమిండియా కు కోచ్ గా ఉండాలని నన్ను అడిగితే.. దాని నేను గౌరవంగా భావిస్తాను. అప్పుడు మరోసారి భారత క్రికెట్ జట్టుకు సేవలు అందించే అవకాశం నాకు లభిస్తుందని భావిస్తానని” జహీర్ ఖాన్ వ్యాఖ్యానించాడు. అయితే స్వదేశీ ఆటగాళ్లనే కోచ్ లు గా నియమించుకోవడానికి బీసీసీఐ గత కొంతకాలం నుంచి అమలు చేస్తోంది. గౌతమ్ గంభీర్ పదవి కాలం ముగిసిన తర్వాత.. ఆ తదుపరి అవకాశం జహీర్ ఖాన్ కే వస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఈ లోగానే జహీర్ ఖాన్ తన మనసులో మాట బయట పెట్టడంతో.. గౌతమ్ గంభీర్ తదుపరి జహీర్ ఖాన్ టీం ఇండియాకు కోచ్ అవుతాడని తెలుస్తోంది.