ఆరోగ్యం విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆహార నియమాలు పాటిస్తారు. ఆహారాన్ని మితంగానే తీసుకుంటారు. యోగాతో పాటు వ్యాయామం కూడా చేస్తుంటారు. అందుకే ఏడు పదుల్లో కూడా చురుగ్గా కనిపిస్తారు చంద్రబాబు. అయితే తానే కాదు ప్రజలు కూడా ఆరోగ్య సూత్రాలు పాటించాలని సూచిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. వైద్యం ఆరోగ్యం పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు రాష్ట్ర ముఖ్యమంత్రి. వ్యాధుల నియంత్రణకు డైట్ కంట్రోల్ తప్పనిసరి అని చెప్పుకొచ్చారు. ప్రతిరోజు వ్యాయామం చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. వీలైతే ప్రాణాయామం కూడా చేయాలని సూచించారు.
Also Read : మావోయిస్టుల అడ్డాకు పవన్… రెండు రోజుల పాటు ఆ ప్రాంతాల్లోనే!
* సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్..
వైద్యం,ఆరోగ్యం, ఆహారం తదితర అంశాలపై సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్( PowerPoint presentation ) ఇచ్చారు. ఈ సందర్భంగా కీలక విషయాలను వెల్లడించారు. అనేక వ్యాధులు మన ఆహార అలవాట్ల కారణంగానే వస్తుంటాయని చెప్పారు. చాలా వ్యాధుల నివారణకు డైట్ కంట్రోల్ చేసుకోవడం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నలుగురు కుటుంబ సభ్యులు ఉన్న కుటుంబంలో ఉప్పు నెలకు 600 గ్రాములు మాత్రమే వాడాలన్నారు. వంట నూనె కూడా నెలకు రెండు లీటర్లు మాత్రమే వాడాలని సూచించారు. చక్కెర కూడా నెలకు మూడు కిలోలు వాడితే సరిపోతుందన్నారు. సమతుల్యమైన ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చునని అధ్యయనాలు చెబుతున్న విషయాన్ని గుర్తు చేశారు సీఎం చంద్రబాబు. ముఖ్యంగా ఉప్పు, వంటనూనె, చక్కెర తగ్గిస్తే ఆరోగ్య సమస్యలు దరి చేరవు అని చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు.
* వ్యాయామంపై సూచనలు..
అలాగే వ్యాయామంపై( exercise) కీలక సూచనలు చేశారు సీఎం. ప్రతిరోజు విధిగా అరగంట పాటు వ్యాయామం చేయాలని రాష్ట్ర ప్రజలకు సూచించారు. వీలైతే యోగాలో ప్రాణాయామం చేయాలని పిలుపునిచ్చారు. ఇటీవల రూపొందించిన న్యూట్రి ఫుల్ యాప్ నకు స్కోచ్ అవార్డు లభించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. అందుకే ఆ యాప్ ను ప్రజలంతా డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో పెరిగిన వైద్య ఖర్చులు, పలు రకాల రుగ్మతలపై ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో చంద్రబాబు వివరించారు. ప్రతి నియోజకవర్గంలో 100 నుంచి 300 పడకలు ఉండే ఆసుపత్రులు నెలకొల్పేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. గుండె జబ్బులు, డయాబెటిస్, హైపర్ టెన్షన్, శ్వాస కోసం వ్యాధులు వంటి సమస్యలు కొన్నిచోట్ల విస్తృతంగా పెరుగుతున్నాయని సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఆహారపు అలవాట్లు విషయంలో ప్రజలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.
Also Read : పవన్ కళ్యాణ్ మీకు ఇది తగునా?
సీఎం చంద్రబాబు ఆరోగ్య సూక్తులు
నెలకు 600గ్రాములు ఉప్పు, 2 లీటర్లు ఆయిల్, 3 కేజీల పంచదార వాడితే చాలు.. వీటికన్నా ఎక్కువ వాడటంతోనే ఆరోగ్య సమస్యలు మొదలు అవుతున్నాయి – సీఎం @ncbn pic.twitter.com/OSFQMgdwI5
— greatandhra (@greatandhranews) April 7, 2025