Karan Johar : పై ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఎవరో గుర్తు పట్టారా..?, బాలీవుడ్ లో ఎన్నో కల్ట్ క్లాసిక్ చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాదు, ఎన్నో అద్భుతమైన చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించి, సుమారుగా మూడు దశాబ్దాలుగా స్టార్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న వ్యక్తి ఆయన. ఒక విధంగా మన తెలుగు చలన చిత్ర పరిశ్రమ బాలీవుడ్ లో ఇలా విస్తరించాడు మూల కారణం ఆయనే. ఆయన సహకారం లేకపోతే నేడు మన టాలీవుడ్ కి పాన్ ఇండియన్ మార్కెట్ క్రియేట్ అయ్యేది కాదు, బాహుబలి, #RRR వంటి వెండితెర అద్భుతాలు మన ముందుకు వచ్చేవి కూడా కాదు. అంతే కాదు ఇతను లవ్ స్టోరీస్ తియ్యడం లో దిట్ట. ఈ వయస్సులో కూడా బాలీవుడ్ లో ఒక అద్భుతమైన లవ్ స్టోరీ చేసి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. ఓవర్సీస్ లో ఇతనికి రజినీకాంత్, షారుక్ ఖాన్ వంటి సూపర్ స్టార్స్ తో సమానమైన మార్కెట్ ఉంది.
Also Read : గుడ్ బ్యాడ్ అగ్లీ ట్రైలర్ లో ఈ ఒక్కటి గమనించారా..?
అతను మరెవరో కాదు కరణ్ జోహార్(Karan Johar). మన తెలుగు సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవ్వడం ‘బాహుబలి’ సిరీస్ నుండే మొదలైంది. ఈ సినిమాని బాలీవుడ్ లో భారీ లెవెల్ లో విడుదల చేసింది కరణ్ జోహారే. బాలీవుడ్ వర్గాలకు మొదటి నుండి మన టాలీవుడ్ అంటే చిన్న చూపు ఉండేది. అక్కడి దర్శక నిర్మాతలు మన సినిమాలను డబ్ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించరు. అలాంటి సమయంలో బాహుబలి(Bahubali Movie) సిరీస్ ని అక్కడి స్టార్ హీరోల సినిమాలతో సమానంగా రిలీజ్ చేసి తెలుగోడి సత్తా దేశమంతా వ్యాప్తి చెందేలా చేశాడు. ఇక నిర్మాతగా, దర్శకుడిగా ఈయన సాధించిన విజయాల గురించి చెప్పుకుంటూ పోతే ఈ ఒక్కరోజు సరిపోదు. అలాంటి చెక్కు చెదరని రికార్డ్స్ అతని సొంతం. ముఖ్యంగా షారుక్ ఖాన్ తో ఈయన చేసిన లవ్ స్టోరీస్ అప్పట్లో ఒక ప్రభంజనం సృష్టించాయి.
చూసేందుకు ఎంతో స్టైలిష్ గా కనిపించే కరణ్ జోహార్ కి సంబంధించిన రీసెంట్ ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. ఎదో వ్యాధి వచ్చినవాడిలాగా కరణ్ జోహార్ ఇలా అయిపోయాడేంటి?, అసలు ఆయనకు ఏమైంది అంటూ అభిమానులు సోషల్ మీడియా లో ఆందోళన వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. నిజంగానే ఆయన ఆరోగ్య సమస్యల వల్ల ఇలా అయిపోయాడా?, లేకపోతే ఏదైనా మూవీ ప్రమోషన్ కోసం ఇలాంటి గెటప్ వేసుకున్నాడా అని అభిమానులు అనుమానిస్తున్నారు. హీరోలతో సమానంగా స్టైలిష్ గా కనిపించే కరణ్ జోహార్ ని ఈ లుక్స్ లో చూడలేకపోయారు అభిమానులు. మరి ఎందుకు ఆయన ఇలా తయారయ్యాడో, కేవలం ఆయన మాత్రమే సమాధానం చెప్పాలి. ఇకపోతే కరణ్ జోహార్ గత ఏడాది ఎన్టీఆర్(Junior NTR) నటించిన ‘దేవర'(Devara Movie) చిత్రాన్ని హిందీ లో గ్రాండ్ గా విడుదల చేశాడు.
Also Read : గౌతమ్ గంభీర్ తర్వాత టీమ్ ఇండియా కోచ్ ఎవరు? జహీర్ ఖాన్ ఏమంటున్నాడంటే?