Yuzvendra Chahal: భారత యువ స్పినర్నర్ యుజ్వేంద్ర చాహల్(Yujwendra Chahal) తన స్పిన్ మాయాజాలంలో ఎదుటి బ్యాట్స్‌మెన్‌లను బురిడీ కొట్టిస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. పరుగుల వరద పారే టీ20, ఐపీఎల్ మ్యాచ్‌లలో అద్భుత ప్రతిబ కనబరుస్తున్నాడు. ఇటీవల నిర్వహించిన వేలంలోనూ చాహల్‌కు మంచి ధరే పలికింది. ఇక చాహల్ భార్య ధనశ్రీ(Dhana Sree). ఆమె ఒక మోడల్. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అందమైన ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులకు కనువిందు చేస్తారు. అయితే కొన్ని రోజులుగా చాహల్–ధనశ్రీ విడిపోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ జంట ఇన్‌స్టాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలు డిలీట్ చేశారు. దీంతో ఇద్దరూ విడిపోతున్నారన్న వదంతులకు ఊతం ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే విడాకుల వార్తలపై అటు ధనశ్రీ, ఇటు చాహల్ ఎట్టకేలకు స్పందించారు. ఇద్దరూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. 2020, డిసెంబర్‌లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.
ధనశ్రీ ఇలా..
విడాకుల(Divarse) వార్తలపై తాను తీవ మనోవేదనకు గురయ్యానని ధనశ్రీ తెలిపారు. తాను, తన కుటుంబం కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. ఏళ్ల తరబడి కష్టపడి ఈ స్థాయికి వచ్చానని, అలాంటిది తనపై ద్వేషం కలిగేలా, తన వ్యక్త్విన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన మౌనానికి అర్థం బలహీనత కాదని పేర్కొన్నారు. ఎన్నటికైనా నిజం గెలుస్తుందని అని తెలిపారు. దానిని సమర్థించుకోవాల్సిన అవసరం లేదని వెల్లడించింది ప్రస్తుత పరిస్థితిలో వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని విలువలతో ముందుకు సాగాలని భావిస్తున్నట్లు ధనశ్రీ తెలిపారు.
చాహల్ ఇలా..
ఇక విడాకుల వార్తలపై క్రికెటర్ చాహల్ కూడా స్పందించారు. ఈమేరకు ఇన్‌స్టా(Insta)లో ఓ పోస్టు చేశారు. నాకు ఇస్తున్న మద్దతుకు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. మీ మద్దతుతోనే ఇంటివాడిని అయ్యానని పేర్కొన్నారు. ఇంకా చాలా ప్రయాణం మిగిలే ఉందని వెల్లడించాడు. నా వ్యక్తిగత జీవితంపై ఆసక్తిని అర్థం చేసుకోగలని పేర్కొన్నారు. కానీ దయచేసి ఆ విషయంలో సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేయొద్దని కోరాడు.
విడాకుల వదంతులపై ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కానీ, విడాకులపై ఇద్దరిలో ఎవరూ స్పష్టత ఇవ్వలేదు. నర్మగర్భంగా పోస్టు పెట్టారు. ఇక చాహల్ మరో యువతితో ముంబై హోటల్‌లో కనిపించాడు. ఈ తరుణంలో చాహల్–ధనశ్రీ కలిసి ఉన్నారా.. విడిపోయారా అనే ప్రశ్నకు సమాధానం త్వరలోనే దొరికే అవకాశం ఉంది.