Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇండియన్ 2 ని చూసి ఎక్కడ మళ్ళీ అదే రేంజ్ రిపీట్ అవ్వుదేమో అని భయపడిన ఆడియన్స్ కి ఈ చిత్రం ఒక స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చిందనే చెప్పొచ్చు. కానీ వింటేజ్ శంకర్ మార్క్ కాదు అని మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు. కేవలం రామ్ చరణ్ అద్భుతమైన నటన, తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వల్ల ఈ సినిమా సేవ్ అయ్యింది కానీ, శంకర్ వల్ల మాత్రం కాదని చూసిన ప్రతీ ఒక్కరు అంటున్నారు. సెకండ్ హాఫ్ మొత్తాన్ని ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఆపన్న క్యారక్టర్ కాపాడింది. సినిమా ఎక్కడా కూడా ఒక్క క్షణం కూడా బోర్ కొట్టదు. అదొక్కటే ఈ చిత్రానికి పెద్ద ప్లస్ అని చెప్పొచ్చు.
ఒకసారి ఈ సినిమాలోని పాజిటీవ్స్ ని, నెగటివ్స్ ని వివరంగా ఈ స్టోరీ లో విశ్లేషిద్దాం. ముందుగా ఫస్ట్ హాఫ్ తీసుకుంటే మొదటి 20 నిమిషాలు చాలా అద్భుతంగా అనిపించింది. రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ కి అయితే మాటల్లేవ్. వెండితెర మీద మెరిసిపోయాడు. కాలేజ్ సన్నివేశాల్లో అయితే వేరే లెవెల్ లో ఉన్నాడు అనొచ్చు. కానీ హీరో హీరోయిన్ మధ్య వచ్చే లవ్ ట్రాక్ చాలా బోర్ గా అనిపించింది. ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు అదిరిపోయింది. ఇంటర్వెల్ సన్నివేశాన్ని ఎవ్వరూ అంచనా వేయలేరు. ఆ రేంజ్ లో ప్లాన్ చేసాడు డైరెక్టర్ శంకర్. కానీ ఫస్ట్ మొత్తం ఎక్కడా కూడా స్టోరీ లో కొత్తదనం కనిపించదు. ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ లో ఆడియన్స్ లో కచ్చితంగా కొత్తదనాన్ని కోరుకుంటారు. అదే ఈ చిత్రం లో లోపించింది. రెగ్యులర్ కమర్షియల్ మూవీ లాగానే అనిపించింది.
కొత్తదనాన్ని కోరుకునే ఆడియన్స్ కి ఫస్ట్ యావరేజ్ గా మాత్రమే అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో మాత్రం రామ్ చరణ్ ఆపన్న క్యారక్టర్ లో తన విశ్వరూపం చూపించాడు. వింటేజ్ శంకర్ డ్యూటీ కూడా ఈ 40 నిమిషాలు వేరే లెవెల్ లో చేసాడు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆపన్న క్యారక్టర్ ని ఇంకో 20 నిమిషాలు పొడిగించి ఉంటే బాగుండేది అనిపించింది. జరగండి సాంగ్ విజువల్ పరంగా అదిరిపోయింది. కానీ ఆ తర్వాత ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు వచ్చే సన్నివేశాలు ఎదో చుట్టేసినట్టుగా అనిపించింది. సినిమాలో మరో బిగ్ మైనస్ ఏమిటంటే భారీ ఎలివేషన్ సన్నివేశాలు లేకపోవడమే. ‘దేవర’, ‘పుష్ప 2 ‘ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద అంతలా క్లిక్ అవ్వడానికి ముఖ్య కారణం ఈ సన్నివేశాలే. అదే ఈ సినిమాలో కొరవడింది. అదొక్కటి సెట్ చేసి ఉంటే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేదని అభిమానుల అభిప్రాయం.