Tirupati Stampede: తిరుపతిలో( Tirupati) ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఇప్పటికే ముగ్గురు అధికారులపై వేటు పడింది. కీలక అధికారుల బదిలీకి సీఎం చంద్రబాబు( CM Chandrababu) ఆదేశించారు. ఈ తొక్కిసలాట ఘటన ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. దీంతో ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించక తప్పలేదు. అటు చంద్రబాబు హుటాహుటిన తిరుపతికి చేరుకున్నారు. టిటిడి అధికారులతో సమీక్షించారు. అయితే అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి సీఎంకు ఎదురైనట్లు తెలుస్తోంది. ఘటనపై సమీక్ష వేళ చైర్మన్ వర్సెస్ ఈవో అన్నట్టు పరిస్థితి మారింది. ఇద్దరు సీఎం ఎదుట ఏక వచనంతో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. తొక్కిసలాట అంశం పక్కన పెట్టి వ్యక్తిగత అంశాలపై రచ్చకు దిగినట్లు సమాచారం. దీంతో ఇద్దరినీ చంద్రబాబు మందలించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. ఈ తొక్కిసలాట ఘటనకు సంబంధించి టిటిడి పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనతో తిరుపతి చేరుకున్న సీఎంకు టీటీడీలో లోపాలు అర్థమయ్యాయి. టిటిడి చైర్మన్, ఈవో, ఏ ఈ ఓ మధ్య సమన్వయం లేదని స్పష్టమైంది.
* తిరుమలలో సీఎం బిజీ
ముఖ్యమంత్రి చంద్రబాబు( CM Chandrababu) నిన్న తిరుపతిలో పర్యటించారు. తొక్కిసలాట ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం స్విమ్స్( swims Hospital ) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. తరువాత టిటిడి పాలన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష చేశారు. ఈ సందర్భంగా చైర్మన్, ఈవో తీవ్రస్థాయిలో వాదనకు దిగినట్లు తెలుస్తోంది. ఇద్దరూ సంయమనం కోల్పోయి.. విచక్షణ మరిచి మాట్లాడినట్లు సమాచారం. నువ్వు నాకేం చెప్పడం లేదు అంటూ చైర్మన్ బి ఆర్ నాయుడు( BR Naidu) ఈవో పై ఏక వచన ప్రయోగం చేశారు. అన్ని చెబుతూనే ఉన్నాం అని ఈవో శ్యామలరావు సమాధానంతో ఇద్దరి మధ్య వాదన మొదలైనట్లు తెలుస్తోంది. అయితే ఇద్దరు తీరును గమనించిన సీఎం చంద్రబాబు సీరియస్ అయినట్లు విశ్వసనీయ సమాచారం.
* సమన్వయం పై చర్చ
ప్రధానంగా ఉన్నత స్థాయి సమీక్షలో సమన్వయం గురించి చర్చకు వచ్చింది. ముందుగా చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ అసలు నన్ను ఈవో పట్టించుకోవడం లేదని చెప్పారు. కనీసం చైర్మన్ అనే గౌరవం కూడా చూపడం లేదని.. ఏ చిన్న విషయాన్ని తనతో చర్చించడం లేదంటూ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. దీంతో ఈవో ఒక్కసారి సంయమనం కోల్పోయారు. నీకేం చెప్పడం లేదు. అన్ని చెబుతూనే ఉన్నాం కదా అంటూ చైర్మన్ పై తీవ్ర స్వరంతో స్పందించారు. దీంతో ఆ ఇద్దరు నువ్వంటే నువ్వు అంటూ ఏక వచనంతో వాగ్వాదానికి దిగారు. ఇంతలో మంత్రి అనగాని సత్యప్రసాద్( Satya Prasad ) జోక్యం చేసుకొని ఇరువురిని శాంతింప చేశారు.
* సీఎం చంద్రబాబు అసహనం
ఈ మొత్తం వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్( Chandrababu serious) అయ్యారు. ముఖ్యంగా ఈవో తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఏమైనా ఉంటే నోట్ రూపంలో ఇవ్వాలని సూచించారు. సీఎం ఎదుట మాట్లాడే తీరు ఇదా? అంటూ ధ్వజమెత్తారు. ఇద్దరూ పరిధి దాటి మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి మీద మీ ప్రెస్ స్టేషన్ అంటూ సీరియస్ అయ్యారు. జరిగింది ఏంటి? మీరు మాట్లాడుతున్నది ఏంటి? అంటూ ఇద్దరి తీరును తప్పు పట్టారు. బాధ్యతల్లో ఉన్న సమయంలో ఓపిక, సమన్వయం ఉండాలని చెప్పుకొచ్చారు. ఈ మొత్తం వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంటామని.. సీరియస్ నిర్ణయాలు ఉంటాయని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు.