IND VS NZ : బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికీ, భీకర మైన బౌలింగ్ దళం ఉన్నప్పటికీ భారత్ న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది..మొదటి టెస్ట్ లో కివీస్ పేస్ బౌలర్ల ధాటికి భారత్ బెంబేలెత్తి పోతే.. రెండో టెస్టు లో స్పిన్ బౌలర్ల చేతిలో వణికి పోయింది. స్వదేశంలో ఆడుతున్నప్పటికీ భారత్ ఏ దశలోనూ కివీస్ కు పోటీ ఇవ్వ లేక పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దారుణమైన ఆట తీరు ప్రదర్శిస్తున్నారు. యువ ఆటగాళ్లు దూకుడుగా ఆడటం వల్లే భారత్ ఆ మాత్రమైనా స్కోరైనా చేయగలిగింది. లేకుంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది.. పూణే టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో టీమ్ ఇండియా కెప్టెన్ గోల్డెన్ డక్ గా ఔటయ్యాడు. రెండవ ఇన్నింగ్స్ లో 8 రన్స్ మాత్రమే చేశాడు. ఫలితంగా జట్టులో మిగతా ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నారు. కోహ్లీ కూడా పూణే టెస్ట్ లో తొలి ఇన్నింగ్స్ లో ఒక్క పరుగు మాత్రమే చేశాడు. రెండవ ఇన్నింగ్స్ లో 17 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మీరు మాత్రమే కాదు సర్ఫ రాజ్ ఖాన్, రిషబ్ పంత్, అశ్విన్, వంటి వారు విఫలమయ్యారు. అందువల్లే టీమ్ ఇండియా న్యూజిలాండ్ చేతిలో సిరీస్ కోల్పోవాల్సి వచ్చింది. అయితే ఇంతటి ఇబ్బందికర పరిస్థితుల్లోనూ టీమిండియా కు జరిగిన మంచి ఏదైనా ఉందంటే అది యశస్వి జైస్వాల్ వల్ల మాత్రమే.
చరిత్ర సృష్టించాడు
జట్టులో మిగతా ఆటగాళ్లు విఫలమైతున్నప్పటికీ.. యశస్వి జైస్వాల్ మాత్రం సత్తా చాటుతున్నాడు. పూణే వేదికగా జరిగిన టెస్టులో టీమ్ ఇండియా ఓడిపోయినప్పటికీ అతడు మాత్రం అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తద్వారా ఒకటే క్యాలెండర్ సంవత్సరంలో స్వదేశంలో టెస్ట్ క్రికెట్లో 1000కి పైగా పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. ఈ ఘనత సాధించిన మూడవ భారతీయ బ్యాటర్ గా అవతరించాడు.. పూణే టెస్టుల్లో సెకండ్ ఇన్నింగ్స్ లో 65 బంతుల్లో 9 ఫోర్లు, మూడు సిక్సర్ల సహాయంతో అతను 77 పరుగులు చేశాడు. ఒకే క్యాలెండరు ఇయర్లో వెయ్యికి పైగా పరుగులు చేయడం ద్వారా సచిన్, కోహ్లీకి సాధ్యం కాని రికార్డును కూడా జైస్వాల్ సృష్టించాడు. యశస్వి కంటే ఒకటి క్యాలెండరు స్వదేశంలో 1000కి పైగా పరుగులు చేసింది ఇద్దరు ఆటగాళ్లే. 1979లో గుండప్ప విశ్వనాథ్, సునీల్ గవాస్కర్ మాత్రమే ఈ ఘనతను అందుకున్నారు. తాజాగా ఈ జాబితాలోకి జైస్వాల్ చేరాడు. దిగ్గజ ఆటగాళ్లు విరాట్, కోహ్లీ కూడా ఈ ఘనతను అందుకోలేకపోయారు. మొత్తంగా చూస్తే ఇంగ్లాండ్ ఆటగాడు గ్రాహం గూచ్(1990), ఆసీస్ ఆటగాడు లాంగర్(2004), పాక్ ఆటగాడు యూసఫ్(2006) లో మాత్రమే స్వదేశం లో ఈ రికార్డు సృష్టించారు.