Fauzi Digital Rights : రికార్డు ధరకు ప్రభాస్ ఫౌజీ డిజిటల్ రైట్స్, ఎన్ని వందల కోట్లు అంటే?

షూటింగ్ కూడా పూర్తి స్థాయిలో మొదలు కాలేదు. అప్పుడే ప్రభాస్ మూవీ రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి. దర్శకుడు హను రాఘవపూడితో ప్రభాస్ చేస్తున్న చిత్రం డిజిటల్ రైట్స్ ఆల్రెడీ ఓ ప్రముఖ సంస్థ దక్కించుకుందట. ఆ వివరాలు ఏమిటో చూద్దాం.

Written By: S Reddy, Updated On : October 26, 2024 7:32 pm

Fauzi Digital Rights

Follow us on

Fauzi Digital Rights :  బాహుబలి 2 తర్వాత ప్రభాస్ కొంచెం స్ట్రగుల్ అయ్యారు. బాహుబలి 2 తో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసిన ప్రభాస్ నుండి ఆ స్థాయి మూవీ రావడానికి సమయం పట్టింది. సాహో భారీ అంచనాల మధ్య విడుదలైంది. హిందీలో విజయం సాధించిన సాహో, తెలుగుతో పాటు మిగతా భాషల్లో నిరాశ పరిచింది. రాధే శ్యామ్, ఆదిపురుష్ చిత్రాలతో మరో రెండు డిజాస్టర్స్ ఆయన ఖాతాలో పడ్డాయి. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఒకింత నిరాశకు గురయ్యారు. అయితే సలార్ చిత్రంతో ప్రభాస్ హిట్ ట్రాక్ ఎక్కాడు.

సలార్ సైతం పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. కానీ భారీ యాక్షన్ ఎపిసోడ్స్ మెస్మరైజ్ చేశాయి. రూ. 700 కోట్లకు పైగా వసూళ్లు సలార్ రాబట్టింది. కల్కి మూవీతో భారీ హిట్ కొట్టాడు ప్రభాస్. కల్కి రూ. 1000 కోట్ల మార్క్ చేరుకుంది. కల్కి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్.. ఇటీవల కొత్త మూవీ లాంచ్ చేశాడు. సీతారామం ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు.

ఇటీవల పూజ కార్యక్రమాలు జరుపుకున్న ఈ మూవీ టైటిల్ ఫౌజి అని ప్రచారం జరుగుతుంది. రెండో ప్రపంచ యుద్ధం నాటి కథతో ఫౌజి రూపొందించనున్నారు. ఈ చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలుగా ఉన్నారు. అనూహ్యంగా సోషల్ మీడియా స్టార్ ఇమాన్వి కి హీరోయిన్ గా ఆఫర్ దక్కింది. ఇమాన్వి ప్రొఫెషనల్ డాన్సర్. ఈ కారణంగా దర్శకుడు ఎంపిక చేసినట్లు సమాచారం.

ఫౌజి మూవీ షూటింగ్ ఇంకా పూర్తి స్థాయిలో మొదలు కాలేదు. అప్పుడే రైట్స్ కొరకు పోటీపడుతున్నారు. ఫౌజి డిజిటల్ రైట్స్ ఫ్యాన్సీ ధరకు ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏకంగా రూ. 150 కోట్లు చెల్లించి ఫౌజి అన్ని భాషల డిజిటల్ రైట్స్ సదరు సంస్థ దక్కించుకుందట. ఈ న్యూస్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో ఫౌజి నిర్మించనున్నారట. టాలెంటెడ్ దర్శకుడు హను రాఘవపూడి నుండి వస్తున్న ఈ చిత్రం పై అంచనాలు ఏర్పడ్డాయి.