Dhurandhar 2 overseas advance bookings: గత ఏడాది డిసెంబర్ 4 న విడుదలైన ‘ధురంధర్'(Dhurandhar Movie) చిత్రం ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటి వరకు ఒక సింగిల్ లాంగ్వేజ్ సినిమా , వెయ్యి కోట్ల గ్రాస్ కి పైగా వసూళ్లను రాబట్టడం ఎవ్వరూ చూడలేదు. కానీ ఈ చిత్రం కేవలం హిందీ భాషలో మాత్రమే విడుదలై 1400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన ‘ధురంధర్ 2 : ది రివెంజ్'(Dhurandhar 2 : The Revenge) చిత్రం ఈ నెల 19 న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల కాబోతుంది. ఇక వసూళ్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో మీ ఊహలకే వదిలేస్తున్నాం. ఎందుకంటే ‘ధురంధర్ ‘ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో అన్ని భాషల్లోనూ విడుదలైంది.
తెలుగు వెర్షన్ కి కూడా నెట్ ఫ్లిక్స్ లో సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో తెలుగు ఆడియన్స్ కూడా సీక్వెల్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన రోజున కచ్చితంగా అందరి మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ గ్రాస్ నమోదు అవుతుందని బలమైన నమ్మకం తో ఉన్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ రీసెంట్ గానే మొదలైంది. ముందుగా నార్త్ అమెరికా లో అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టారు. అక్కడి ట్రేడ్ విశ్లేషకుల లెక్కల ప్రకారం ఈ చిత్రానికి ఇప్పటి వరకు $67,112 డాలర్ల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఒక హిందీ చిత్రానికి 16 రోజుల ముందు ఈ రేంజ్ గ్రాస్ నమోదు అవ్వడం అనేది సాధారణమైన విషయం కాదు. 220 లొకేషన్స్ కి గానూ 312 షోస్ ని షెడ్యూల్ చేయగా, 3932 టిక్కెట్లు అమ్ముడుపోయాయి.
Also Read: ఇన్ని అడ్డంకులను ఎదురుకొని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ హిట్ అవ్వడం అసాధ్యమేనా?
ఇక పూర్తి స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెడితే ఏ రేంజ్ గ్రాస్ ఉంటుందో ఊహించుకోండి. ఇది కేవలం హిందీ వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ మాత్రమే. తెలుగు వెర్షన్ కి సంబంధించిన బుకింగ్స్ ఇంకా మొదలు అవ్వలేదు. తెలుగు వెర్షన్ కి బుకింగ్స్ మొదలు పెడితే , కచ్చితంగా హిందీ వెర్షన్ బుకింగ్స్ కన్నా ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అన్నీ పర్ఫెక్ట్ గా కుదిరితే ప్రీమియర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రీ సేల్స్ గ్రాస్ 2 మిలియన్ డాలర్లను దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. మరి ఆ రేంజ్ కే ఈ చిత్రం వెళ్తుందా లేదా అనేది చూడాలి. సినిమా రన్ టైం 4 గంటల వరకు ఉంది, ఇది చాలా మైనస్ అవుతుందేమో అని అంతా అనుకున్నారు. కానీ ఈ చిత్రం అందరి అంచనాలను తారుమారు చేసి ముందుకు బుల్లెట్ లాగా దూసుకుపోతుంది. ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి మరి.