Homeక్రీడలుక్రికెట్‌Yashasvi Jaiswal: ఒక్క డిన్నర్.. ఈ క్రికెటర్ జీవితాన్ని ఎలా మార్చిందంటే..

Yashasvi Jaiswal: ఒక్క డిన్నర్.. ఈ క్రికెటర్ జీవితాన్ని ఎలా మార్చిందంటే..

Yashasvi Jaiswal: ఇప్పుడు మనం సోషల్ మీడియా కాలంలో ఉన్నాం. ఏదైనా జరిగితే చాలు.. దానికి తగ్గట్టుగా కథలు అల్లడం.. దానిని
వ్యాప్తిలోకి తీసుకురావడం అలవాటుగా మారిపోయింది. సోషల్ మీడియా కాలంలో నిజాలకు విలువలేదు. ఊహాగానాలకు అడ్డే లేదు. ఈ పరంపర ఇలా సాగిపోతూనే ఉంది. దీనికి అడ్డుకట్ట వేయాలని.. స్పీడ్ బ్రేకర్లు నిర్మించాలని చాలామంది అనుకున్నప్పటికీ.. అది సాధ్యం కావడం లేదు. సాధ్యమయ్యే పనిలాగా అనిపించడం లేదు.

సోషల్ మీడియా కాలంలో సెలబ్రిటీలకు కొత్త కొత్త తలనొప్పులు వస్తున్నాయి. మొదటిదాకా టెక్నాలజీని ఉపయోగించి రకరకాల వీడియోలు రూపొందించేవారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో సర్కులేట్ చేసి తమ పైశాచిక ఆనందం పొందేవారు. ఇప్పుడు వీడియోల స్థాయి కూడా దాటిపోయింది. జస్ట్ సెలబ్రిటీలు గడప దాటితే చాలు.. ఇక కొంతమంది చేయాల్సిన పని చేస్తూనే ఉన్నారు.

కొంతమంది “మార్చుడు ” గాళ్ల వల్ల ఒక క్రికెటర్ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. వాస్తవానికి ఈ వ్యవహారంలో అతనికి సంబంధం లేదు. కానీ, బాధిత పక్షం లాగా మారిపోయాడు. అలా మారిపోయిన ఆ ఆటగాడి పేరు యశస్వి జైస్వాల్. టీమిండియాలో వర్ధమాన క్రికెటర్ గా పేరు తెచ్చుకున్న ఇతడు.. సూపర్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇటీవల అతడు ముంబైలో ఒక రెస్టారెంట్ వెళ్ళాడు. అక్కడ డిన్నర్ చేశాడు. అదే సమయానికి ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్ అక్కడికి వచ్చింది. ఆమె కూడా డిన్నర్ చేసింది. ఇదే సమయంలో కొంతమంది ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీశారు. వాటిని సోషల్ మీడియాలో పెట్టారు. ఇంకేముంది జైస్వాల్, మృణాల్ ఠాకూర్ మధ్య ఏదో జరుగుతోందని.. వారిద్దరి మధ్య ఏదో ఉందని ప్రచారం మొదలైంది. వాస్తవానికి ఇటువంటివి గాసిప్ రాయుళ్లకు ఆనందాన్ని కలిగిస్తాయి. కానీ ఇటువంటి ఎదుర్కొనే వాళ్లకే ఇబ్బందిని తెప్పిస్తాయి. ఎందుకంటే సెలబ్రిటీలు కూడా మనుషులే. వాళ్లకు కూడా మనసు ఉంటుంది.

మృణాల్ ఠాకూర్ మీద ఇటువంటి గాసిప్ లు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఆమె ధనుష్ తో కలిసి రిలేషన్ లో ఉందని వార్తలు వచ్చాయి. ఇద్దరు పెళ్లికూడా చేసుకుంటున్నారని ప్రచారం మొదలైంది. ఈ ప్రచారం చివరికి ధనుష్ దాకా వెళ్ళింది. దీంతో అతడు దీనిని ఖండించాడు. చివరికి మృణాల్ కూడా దీనిపై స్పందించారు. అదంతా అబద్ధమని కొట్టి పారేశారు. ఇప్పుడు జైస్వాల్ తో ఆమెకు ముడిపెట్టారు. ఇంకా ఎంతమంది తో ముడి పెడతారో.. ఎన్ని రకాల సంబంధాలు అంటగడతారో..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Electricity Complaint Number

Electricity Complaint Number: మీ ప్రాంతంలో కరెంటు పోయిందా.. జస్ట్ ఈ నెంబర్ కు కాల్ చేయండి..

Electricity Complaint Number: ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే చాలా ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది....
Ramayana Movie

Ramayana Movie: రామాయణంలో రావణుడు.. యష్ బీభత్సకాండ కు రణబీర్ షాక్

Ramayana Movie: నితీష్ తివారీ డైరెక్షన్లో 'రామాయణ' అనే భారీ పౌరాణిక చిత్రం సిద్ధమవుతోంది. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్.. రావణుడిగా యశ్ పాత్రను పోషించనున్నారు. సీతాదేవిగా సాయి పల్లవి నటిస్తున్నారు. హనుమంతుడి...
Haripriya Vasishta N Simha

Haripriya Vasishta N Simha: ఈ భార్యభర్తలిద్దరూ ప్రముఖ నటులే.. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు..

Haripriya Vasishta N Simha: సినిమా అంటేనే రంగుల ప్రపంచం. ఇందులో ఒక్కసారి ఛాన్స్ వస్తే ఎవరు వదులుకోరు. ఒక కుటుంబంలో ఒకరికి అవకాశం వస్తే ఆ తర్వాత వారికి సంబంధించిన వారు...
Quality Content In Cinema

Quality Content In Cinema: కంటెంటే కింగ్.. ఇప్పటికైనా తత్త్వం బోధపడిందా?

Quality Content In Cinema: గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీకి గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాయి. వెండితెరకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఓటీటీలేనని చాలా మంది ఆరోపించారు. కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు...
Adarsha Kutumbam

Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ లో ఏముంది… అదొక్కటి తప్ప…

Adarsha Kutumbam: వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆదర్శ కుటుంబం' సినిమాకు సంబంధించిన గ్లింప్స్ కొద్ది సేపటి క్రితం రిలీజ్ అయింది. ఈ గ్లింప్స్ లో సినిమా యొక్క ఎంటైర్...
Oktelugu Epaper