WTC Points: వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ (2021-23) పాయింట్స్ టేబుల్లో ఆస్ట్రేలియా టాప్-2కి చేరుకుంది. ప్రతిష్టాత్మకమైన యాషెస్ టెస్టు సీరిసులో ఆస్ట్రేలియా దుమ్ము రేపుతోంది. ఇంగ్లాండ్ పై వరుస విజయాలతో దూసుకెళుతోంది. ఇటీవల అడిలైడ్ వేదిక జరిగిన రెండో టెస్ట్ మ్యాచులో ఇంగ్లాండ్ పై ఆస్ట్రేలియా 275 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. ఇప్పటికే ఈ సీరిసులో 2-0తో ఆస్ట్రేలియా ముందంజలో నిలిచింది.
ఈ సూపర్ విక్టరీతో ఆస్ట్రేలియా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్(2021-23) పాయింట్స్ టేబుల్లో టాప్-2 ప్లేసుకు చేరుకుంది. కాగా ఐసీసీ టెస్టు సిరీసులోని ప్రతీ మ్యాచ్ కు 12పాయింట్ల చొప్పున కేటాయిస్తోంది. టెస్టు మ్యాచ్‌లో గెలిచిన జట్టుకి 12పాయింట్లు, టై అయితే రెండు జట్లకీ చెరో ఆరు పాయింట్లు, డ్రా అయితే నాలుగు పాయింట్లని ఐసీసీ కేటాయిస్తోంది.
కాగా సిరీస్‌లో మ్యాచుల సంఖ్యపై మాత్రం ఐసీసీ పరిమితిని విధించ లేదు. దీంతో వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిష్ లో అన్ని జట్ల స్థానాలు తారుమారవుతున్నాయి. యాషెస్ సిరీసులో వరుసగా రెండు విజయాలతో 24పాయింట్లు సాధించిన ఆస్ట్రేలియా రెండో స్థానానికి చేరుకుంది. అగ్రస్థానంలో శ్రీలంక(24పాయింట్స్)తో కొనసాగుతోంది.
మూడో స్థానంలో పాకిస్థాన్(36 పాయింట్స్), నాలుగో స్థానంలో భారత్(42పాయింట్స్)తో ఉన్నాయి. అయితే విజయాల శాతం ఆధారంగా టేబుల్ క్రమాన్ని ఐసీసీ నిర్ణయిస్తోంది. దీంతో పాయింట్స్ తక్కువ ఉన్నప్పటికీ ఆస్ట్రేలియా, శ్రీలంక జట్టు అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి.
Also Read: కోహ్లిపై బీసీసీఐ కుట్ర పన్నుతోందా? దక్షిణాఫ్రికా పర్యటనలో రాణించకపోతే అంతేనా?
డబ్ల్యూటీసీ 2021-23లో భాగంగా ఇప్పటివరకు శ్రీలంక, ఆస్ట్రేలియా రెండేసి చొప్పున మ్యాచ్‌లు ఆడి రెండూ గెలిచాయి. వీటి గెలుపు శాతం వందశాతంగా నమోదైంది. మరోవైపు భారత్ ఆరు మ్యాచ్‌లాడితే మూడింట్లో గెలిచి, ఒకదాంట్లో ఓడి, రెండు మ్యాచులను డ్రా చేసుకుంది. భారత్ గెలుపు 58.33శాతంగా నమోదైంది. దీంతో భారత్ నాలుగో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది.
అలాగే ఓడిన జట్టుకి పాయింట్లేమీ ఉండవు. జట్లు స్లో ఓవర్ రేట్ కారణమైతే ఒక్కో ఓవర్‌కి ఒక్కో పాయింట్ కోత పడుతుంది. ఇప్పటికే ఇంగ్లండ్ ఈ శిక్షకు గురైంది. ఈ ఏడాది ఇంగ్లండ్ సిరీస్ లో కూడా టీమిండియా స్లో రన్ రేట్ తో పాయింట్లు కోల్పోవాల్సి వచ్చింది. ఇక త్వరలోనే సౌతాఫ్రికాతో మూడు టెస్టులు ఆడనుంది. విజయాల ఆధారంగా డబ్ల్యూటీసీలో భారత్ తన స్థానాన్ని మెరుగుపర్చుకునే అవకాశం ఉండనుంది.
Also Read: విరాట్ కోహ్లీ వర్సెస్ గంగూలీ.. ట్విట్టర్ లో ట్రెండింగ్ ఇదే