https://oktelugu.com/

F3: సమ్మర్​కు సై అంటున్న ఎఫ్​3… విడుదల ఎప్పుడంటే?

F3: అనిల్ రావిపుడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్​, వరుణ్​ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం ఎఫ్ 3. ఈ సినిమాలో తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్​లో వచ్చిన ఎఫ్​2 ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే మరోసారి కామెడీతో నవ్వించేందుకు సిద్ధమయ్యింది చిత్రబృందం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్​పై దిల్​రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్​ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్​ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికీ ఈ సినిమా నుంచి […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 21, 2021 / 01:09 PM IST
    Follow us on

    F3: అనిల్ రావిపుడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్​, వరుణ్​ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం ఎఫ్ 3. ఈ సినిమాలో తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్​లో వచ్చిన ఎఫ్​2 ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే మరోసారి కామెడీతో నవ్వించేందుకు సిద్ధమయ్యింది చిత్రబృందం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్​పై దిల్​రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్​ సంగీతం అందిస్తున్నారు.

    F3 Movie Venkatesh

    ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్​ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికీ ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు సినిమాపై హైప్​ క్రియేట్​ చేశాయి. అయితే, ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదల కావాల్సి ఉండగా.. తాజాగా, రిలీజ్​ డేట్​ మారుస్తూ కొత్త అప్​డేట్​ ఇచ్చారు మేకర్స్​.  ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్​ 29న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే సమ్మర్​ సోగ్గాళ్లు అంటూ సినిమాకు సంబంధించిన పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమాకు, గతంలో వచ్చిన ఎఫ్​2 కథకు ఎటువంటి సంబంధం ఉండదని మరోసారి గుర్తు చేశారు అనిల్​ రావిపుడి.

    Also Read: ‘పుష్ప’ లేటెస్ట్ కలెక్షన్స్.. బాక్సాఫీస్ షేక్ అయింది !

    https://twitter.com/SVC_official/status/1473164624782450689?s=20

    కాగా, దృశ్యం2తో సూపర్ హిట్ కొట్టిన వెంకీ మామ.. ప్రస్తుతం రానాతో కలిసి ఓ వెబ్​సిరీస్​ తీస్తున్నాడు. మరోవైపు వరుణ్​తేజ్​ గని సినిమాతో బాక్సర్​గా కనిపించేందుకు సిద్ధమయ్యాడు. ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్​గా నటిస్తుండగా సునీల్ శెట్టి, ఉపేంద్ర కీలకపాత్రలు పోషిస్తున్నారు. కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రోమోలు, పోస్టర్​లు అభిమానులకు అచనాలు రేకెత్తిస్తున్నాయి.

    Also Read: ‘శ్యామ్​ సింగరాయ్’​లో కిస్ సీన్​పై యాంకర్​ డౌట్​.. స్ట్రాంగ్​ కౌంటర్ ఇచ్చిన సాయిపల్లవి