Fake Lady: ఎన్నో ఆశలతో ఒక యువకుడు వివాహం చేసుకుని సంతోషంతో తన భార్యకు కావలసిన నగలు బట్టలు కొనుగోలు చేసి తన భార్యతో తన ఇంట్లో అడుగు పెట్టాడు. ఇక తన జీవితం సుఖంగా సాగిపోతుందని ఆ యువకుడు భావించాడు. అయితే తన పెళ్లి జరిగి ఒక్కరోజు కూడా కాకముందే ఆ వధువు అత్తవారింటిలో ఉన్న డబ్బులు దొంగలించి రాత్రికి రాత్రి పరారైన ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…
హైదరాబాద్ సమీప గ్రామానికి చెందిన 40 సంవత్సరాల
బ్రహ్మచారి ఓమిత్రుడి సాయంతో పెళ్లిళ్ల బ్రోకర్‌ను కలిశాడు. తనకు రూ లక్ష రూపాయలు చెల్లిస్తే ఒక మంచి సంబంధం చూపిస్తానని చెప్పడంతో తనకు లక్ష రూపాయలు చెల్లించి మంచి సంబంధం చూడమని చెప్పారు.ఈ క్రమంలోనే తనతోపాటు విజయవాడకి వస్తే అమ్మాయి చూపిస్తానని బ్రోకర్ చెప్పడంతో వరుడు తన మిత్రుడి సహాయంతో విజయవాడ వెళ్ళారు. ఈ క్రమంలోనే ఒక అమ్మాయిని చూపించగా గురువారం విజయవాడలోని ఒక లాడ్జిలో వివాహం చేసుకొని అనంతరం హైదరాబాద్ యాదగిరిగుట్టలో వ్రతం ఆచరించి ఆపై నవవధువు కావలసిన వస్తువులను షాపింగ్ చేశారు.
Also Read: కట్నం డబ్బులతో పరారైన వరుడు… ఆందోళనకు దిగిన వధువు.. చివరికి ఇలా!
ఈ క్రమంలోనే వరుడు వధువుకు కావాల్సిన 40 వేల రూపాయల దుస్తులు, మూడు తులాల బంగారు గొలుసు తీయించి అనంతరం రాత్రి 8 గంటల సమయంలో తన స్వగ్రామానికి వెళ్లారు. అత్తవారింట్లో అడుగుపెట్టిన వధువు బీరువాలో బట్టలు సర్దుకున్నట్లు నటించి ఇంట్లో ఉన్న డబ్బులను తన బ్యాగులోకి సర్దింది. ఇక తనతోపాటు వచ్చిన మరొక మహిళ ముందుగానే కారు అద్దెకు మాట్లాడి సిద్ధంగా ఉంటుంది. తనకు చాలా తలనొప్పిగా ఉంది దుకాణానికి వెళ్లి మాత్ర తీసుకురమ్మని వధువు వరుడికి చెప్పగా అతను మాత్ర కోసం బయటకు వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన ఆ ఇద్దరు యువకులు కారులో అక్కడి నుంచి పరారయ్యారు.ఇక వీరి వ్యవహారం చూసి అనుమానం వచ్చిన కార్ డ్రైవర్ వీరిని ప్రశ్నించగా తనని బెదిరించారు. ఇలా తిరిగి ఆ ఇద్దరు యువతులు విజయవాడకు వెళ్ళిపోయారు. ఇక వరుడు అసలు బాగోతం తెలుసుకొని ఉదయం స్థానిక పెద్దలకు చెప్పడంతో అసలు విషయం బయటపడింది.
Also Read: హీనంగా మారిన వంటలక్క పరిస్థితి.. మరీ ఇంత దారుణమా!