Chiranjeevi : సామాన్యుడు కూడా సోలోగా ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోగా ఎదగొచ్చు అనే ఒక బెంచ్ మార్కును సెట్ చేసినా నటుడు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)… ఆయన ఇండస్ట్రీలో ఏ సపోర్టు లేకుండా ఒక్కడే వచ్చి తన నటనతో మంచి పర్ఫామెన్స్ ని ఇచ్చి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ మెగాస్టార్ గా మారాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు సైతం అతనికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చే సినిమాలే కావడం విశేషం…70 సంవత్సరాల వయసులో కూడా యంగ్ హీరోలకు సైతం పోటీని ఇస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…ఆయన ఒక సినిమాకి కమిట్ అయ్యాడు అంటే ఆ సినిమా పూర్తి అయ్యేంతవరకు అందులోనే పూర్తిగా నిమగ్నమై ఉంటాడు. ఇక దానికి తగ్గట్టుగానే ఆయన హవ భావాలను పలికిస్తూ ప్రేక్షకులందరిని మెప్పించే విధంగా నటిస్తూ ఉంటాడు. మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది నటులు వాళ్లకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నారు. ఇక సౌత్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఎదిగిన నటుడు కూడా చిరంజీవే కావడం విశేషం…ఇలాంటి గొప్ప నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి దొరకడం మన ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఆయన వశిష్ట (Vashishta) డైరెక్షన్లో విశ్వంభర (Vishwambhara) సినిమా చేస్తున్నాడు.
Also Read : పవన్ కళ్యాణ్ ఇక సినిమాలు మానేస్తే మంచిదా..?
ఈ సినిమా రిలీజ్ కి దగ్గర పడుతున్న సందర్భంలో జూన్ నుంచి అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో చేయబోతున్న సినిమా రెగ్యూలర్ షూటింగ్లో పాల్గొనబోతున్నాడు. అయితే ఈ సినిమాలో ఒకప్పుడు చిరంజీవితో రొమాన్స్ చేసి ఆడి పాడిన నటి ఇప్పుడు చిరంజీవిని డీ కొట్టే పాత్రలో నటించబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆమె ఎవరు అంటే విజయశాంతి…
ఒకప్పుడు చిరంజీవితో గ్యాంగ్ లీడర్, కొండవీటి దొంగ, కొండవీటి రాజా లాంటి సూపర్ డూపర్ సక్సెస్ ఫుల్ సినిమాల్లో నటించి మెప్పించిన ఆమె ఇప్పుడు చిరంజీవికి విలన్ గా మారి ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటించబోతున్నట్టుగా తెలుస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్ లో విజయశాంతి ఇప్పటి వరకు పాజిటివ్ క్యారెక్టర్లను మాత్రమే చేసింది. కానీ మొదటిసారి చిరంజీవి కోసం నెగెటివ్ రోల్ ని కూడా చేయబోతుంది అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి.
ఇక అనిల్ రావిపూడి మహేష్ బాబు (Mahesh Babu ) కాంబినేషన్లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో విజయశాంతి నటించిన విషయం మనకు తెలిసిందే. మరి ఆ చనువుతోనే అనిల్ ఈ సినిమాలో కూడా విజయశాంతి(Vijay Shanthi) ని భాగం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా చిరంజీవి సినిమాలో విజయశాంతి నటిస్తే మాత్రం ఈ సినిమాకి భారీ హైప్ అయితే క్రియేట్ అవుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…