IPL 2025: ఇదీ ఆస్ట్రేలియా క్రికెట్ మేనేజ్మెంట్ చేసిన ప్రకటన. నిజంగా పైకి చూస్తే ఇది గొప్పగానే అనిపిస్తోంది. పైగా ఆస్ట్రేలియా మేనేజ్మెంట్ ఉదారతపై ఎక్కడా లేని గౌరవం పెరుగుతుంది. కానీ లోతుగా వెళ్తే మాత్రం అసలు విషయం అవగతం అవుతుంది. ఎందుకంటే ఆస్ట్రేలియా జట్టులో హెడ్, క్లాసెన్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడుతున్నారు. ఇప్పటికే ఈ జట్టు ప్లే ఆఫ్ అవకాశాలను వదిలేసుకుంది. మొత్తంగా గ్రూప్ దశ నుంచే ఇంటికి వచ్చేయనుంది. హైదరాబాద్ జట్టుకు కమిన్స్ నాయకత్వం వహిస్తున్నాడు..హెడ్ కీలక ఆటగాడిగా ఉన్నాడు.. ఈ సీజన్లో హైదరాబాద్ ఇంకా రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. అయితే ఐపీఎల్ అర్ధాంతరంగా నిలుపుదలకు గురి కావడంతో హెడ్, కమిన్స్ స్వదేశానికి తిరిగి వచ్చేశారు. ఇక మరో కీలక ఆటగాడు స్టార్క్, హేజిల్ వుడ్ వుడ్ కూడా స్వదేశానికి తిరిగి వచ్చేసారు. వీరిలో స్టార్క్ ఢిల్లీ క్యాపిటల్స్, హేజిల్ వుడ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరు కూడా ఐపీఎల్ అర్ధాంతరంగా వాయిదా పడటంతో స్వదేశానికి వెళ్ళిపోయారు. ప్రస్తుతం వీరు విశ్రాంతి తీసుకుంటున్నారు. సాయంత్రం పూట సరదాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. కాకపోతే ఈ విషయాలను అఫీషియల్ గా మాత్రం ఎక్కడా ప్రకటించడం లేదు.
Also Read: 53 నిమిషాల్లో 53 లక్షల లైక్స్.. అక్కడ రికార్డ్ సృష్టించిన విరాట్ కోహ్లీ
ఐపీఎల్ తర్వాత ఆస్ట్రేలియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ ఆడాల్సి ఉంది. ఇంగ్లాండ్లో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. జూన్లో జరిగే ఈ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తలపడతాయి. గత సీజన్లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. రోహిత్ సేనను ఓడించి టెస్ట్ గదను తొలిసారిగా అందుకుంది. ఈసారి కూడా అదే స్థాయిలో సత్తా చూపించి రెండవసారి టెస్ట్ గదను దక్కించుకోవాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. ఇందులో భాగంగానే జట్టు కూర్పు విషయంలో మేనేజ్మెంట్ అత్యంత పకడ్బందీగా వ్యవహరిస్తున్నది.. అయితే ప్రస్తుతం ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడిన నేపథ్యంలో.. ఆస్ట్రేలియా ఆటగాళ్లు కమిన్స్, స్టార్క్, హెజిల్ వుడ్, హెడ్ వంటి ఆటగాళ్లు స్వదేశానికి వచ్చిన నేపథ్యంలో.. వారిని తిరిగి ఇండియాకు పంపించే ఆలోచన ఆస్ట్రేలియా మేనేజ్మెంట్ కు లేదని తెలుస్తోంది. అందువల్లే వారు భయపడుతున్నారని తెరపైకి కొత్త నాటకాన్ని తీసుకొచ్చింది.. భయం పేరుతో వారిని ఆస్ట్రేలియాలోనే ఉంచి.. ఐపీఎల్ ఆడకుండా చేసి.. ఇక్కడే పూర్తిస్థాయిలో ప్రాక్టీస్ చేయించి.. ఆ తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లో ఆడించాలని ఆస్ట్రేలియా మేనేజ్మెంట్ లక్ష్యంగా పెట్టుకుందని తెలుస్తోంది. ఇక స్వదేశానికి వచ్చిన ఆస్ట్రేలియా ఆటగాళ్లపై అక్కడ మీడియా సానుభూతిపరమైన కథనాలు రాస్తోంది.. ఆటగాళ్లు భయపడ్డారని.. వారు అక్కడి పరిస్థితులను చూసి తీవ్రంగా కలత చెందారని.. ఇలాంటి సమయంలో వారికి ధైర్యం అవసరమని.. ఆ బాధ్యత ఆస్ట్రేలియా క్రికెట్ మేనేజ్మెంట్ పై ఉందని సన్నాయి నొక్కులు నొక్కింది. వాస్తవానికి ఆటగాళ్ల సెక్యూరిటీ విషయంలో బిసిసిఐ తీవ్రమైన చొరవ తీసుకుంది. బీసీసీఐ పెద్దలు ఏకంగా రంగంలోకి దిగి ప్లేయర్లను దగ్గరుండి వారి వారి దేశాలకు పంపించారు. ఇందులో ఆటగాళ్లు భయపడాల్సిన అవసరం ఏముంది. భయపడేంత ప్రమాదం ఇండియాలో ఏం జరిగింది.. ఐపీఎల్ ద్వారా కోట్లకు కోట్లు సంపాదించవచ్చు. యాడ్స్ ద్వారా భారీగా వెనకేసుకోవచ్చు. కానీ చిన్న అవాంతరం తలెత్తితే మాత్రం దానికి భయం అని కలరింగ్ ఇస్తున్నారు. ఏం ప్లేయర్లు రా నాయనా అంటూ ఆస్ట్రేలియా ఆటగాళ్లపై నెటిజన్లు మండిపడుతున్నారు.