Sandeep hurry in choosing Spirit heroine : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ (Prabhas) లాంటి నటుడు పాన్ ఇండియాలో స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. సందీప్ రెడ్డి వంగ (Sundeep Reddy Vanga) లాంటి దర్శకుడితో ఆయన స్పిరిట్ (Spirit) అనే సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. సందీప్ చేసిన అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఆయన వెను తిరిగి చూడకుండా వరుసగా సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమవైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో సందీప్ మంచి కథలను సినిమాలుగా చేయాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చి పెట్టినవే కావడం విశేషం… అయితే స్పిరిట్ సినిమాలో దీపిక పదుకొనే (Deepika Padukone) హీరోయిన్ గా తీసుకుంటున్నట్టు గా మొదట వార్తలు వచ్చినప్పటికి ఆ తర్వాత ఆమె పెట్టిన కండిషన్స్ కి సందీప్ ఒప్పుకోకపోవడంతో ఆమె సినిమా నుంచి తప్పుకుంది. ఇక ఇప్పుడు ఆమె ప్లేస్ లో సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన త్రిప్తి డిమ్రీని తీసుకున్నట్టుగా సందీప్ అయితే అనౌన్స్ చేశాడు. మరి ఈ విషయం మీద కొంత వరకు చర్చలైతే జరుగుతున్నాయి. ఎందుకంటే త్రిప్తి డిమ్రి కి ఇప్పటి వరకు పెద్ద హీరోతో మెయిన్ హీరోయిన్ గా చేసిన సందర్భాలైతే లేవు.
Also Read : ప్రభాస్ స్పిరిట్ ఇప్పుడప్పుడే ఉండదా..?
మరి ఈ సినిమాలో తనను మెయిన్ హీరోయిన్ గా తీసుకోవడం పట్ల కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పటికి సందీప్ మాత్రం పూర్తి కాన్ఫిడెంట్ తో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో త్రిప్తి డిమ్రీని టాప్ హీరోయిన్ గా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది.
ఎవరైతే ఈ సినిమాని రిజెక్ట్ చేశారో వాళ్ళందరూ ఈ సినిమాను చూసి కుళ్ళుకోవాలని మనకెందుకు ఆ స్టార్ డమ్ రాలేదు అనే ఉద్దేశ్యంతో సందీప్ ఇలాంటి ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సినిమా యూనిట్ మొత్తం అతని నిర్ణయాన్ని పాటిస్తున్నప్పటికి అది సినిమాకి ప్లస్ అవుతుందా? లేదా అనే విషయంలోనే కొంతవరకు సందిగ్ధ పరిస్థితి అయితే ఏర్పడింది.
ఎందుకంటే దీపిక పదుకొనే (Deepika Padukune) కి బాలీవుడ్ లో మంచి మార్కెట్ అయితే ఉంది. మరి అంతటి మార్కెట్ త్రిప్తి డిమ్రి కి లేదు. దాని వల్ల సినిమాకి మైనస్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనే ధోరణిలో కూడా కొన్ని కథనాలైతే వెలవడుతున్నాయి…